Bigg Boss 5 Telugu: 10వ వారం ఎలిమినేషన్ లో ఏం జరగబోతోంది..?

బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ అనేది ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అయితే, ఈసారి నామినేషన్స్ లో మొత్తం ఐదుగురు ఉన్నారు. వారిలో మానస్, కాజల్, సిరి, రవి ఇంకా సన్నీలు ఉన్నారు. వీరు కాకుండా ఈసారి అనూహ్యంగా నామినేషన్స్ లో లేని జెస్సీ ఇంటి నుంచీ బయటకి వెళ్లిపోయినట్లుగా సమాచారం తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా జెస్సీ ఆరోగ్యం అంతగా బాగోలేదు. ప్రస్తుతం సీక్రెట్ రూమ్ లో డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నాడు జెస్సీ. దీంతో బిగ్ బాస్ కాల్ తీసుకుని జెస్సీని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించినట్లుగా సమాచారం తెలుస్తోంది. మెరుగైన వైద్యం అందించడం కోసం, అతడి హెల్త్ కండీషన్ ఇంకా బెటర్ అవ్వడం కోసం ఇలా చేసినట్లుగా చెప్తున్నారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో జెస్సీ జెర్నీ ముగిసినట్లే. నిజానికి ఓటింగ్ లో లీస్ట్ లో కాజల్ ఉంది. నామినేషన్స్ లో ఉన్న వారిలో చూసినట్లయితే, సన్నీ, రవి టాప్ ప్లేస్ లో ఉన్నట్లుగా సమాచారం. సన్నీ కి దాదాపుగా 30శాతం ఓటింగ్ జరిగినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. తర్వాత సెకండ్ ప్లేస్ లో రవి, ఆ తర్వాత ప్లేస్ లో సిరి ఉన్నారు. ఇక ఓటింగ్ లో అందరికంటే లీస్ట్ లో మానస్ అండ్ కాజల్ లు ఉన్నారు. నిజానికి మానస్ డేంజర్ జోన్ లో ఏమీలేడు. ఫస్ట్ డే నుంచీ 15శాతం వరకూ ఓటింగ్ ని ప్రభావితం చేస్తూ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. అయితే, కాజల్ ఫస్ట్ డే నుంచీ అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో లీస్ట్ లోనే ఉంది. అందుకే, కాజల్ ఎలిమినేట్ అవుతుందనే అనుకున్నారు అందరూ.

కానీ, ఈవారం జెస్సీ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి, అతడ్ని ఇంటికి పంపించి ఎలిమినేషన్ ని తీసేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. జెస్సీ ఈవారం ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి కాజల్ సేఫ్ అయిపోయింది. ఇక జెస్సీ గేమ్ లో ఎక్కువశాతం సిరి ఇంకా షణ్ముక్ లతోనే గడిపాడు. మద్యలో కొన్ని విభేదాలు వచ్చినా కూడా లాస్ట్ టైమ్ నామినేషన్స్ లో కూడా తన ఫ్రెండ్ అయిన షణ్ముక్ ని సేఫ్ చేశాడు జెస్సీ. ఇప్పుడు జెస్సీ వెళ్లిపోవడంతో ఫ్రెండ్స్ అయిన సిరి, షణ్ముక్ ఎలా ఫీల్ అయ్యారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus