Boyapati Srinu, Allu Arjun: రామ్- బోయపాటి ల కాంబో.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందిగా..!

భద్ర’, ‘తులసి’, ‘సింహ’, ‘లెజెండ్’, ‘సరైనోడు’, ‘అఖండ’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లతో స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న దర్శకుడు బోయపాటి శ్రీను…తన తర్వాతి సినిమా అల్లు అర్జున్ తో ఉంటుందని అంతా అనుకున్నారు.ఈ విషయం పై అల్లు ప్రొడక్షన్ హౌస్ నుండీ హింట్లు కూడా వచ్చాయి. కానీ అదేంటో బోయపాటి శ్రీను తన కొత్త సినిమాని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో చేయబోతున్నట్టు అనౌన్స్ చేసాడు.

Click Here To Watch

రామ్‌తో ‘ది వారియర్’ వంటి బైలింగ్యువల్ మూవీని నిర్మిస్తున్న ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి తన ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ పతాకం పై ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో కలుపుకుని … ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా దాదాపు ఫిక్స్ అయ్యి సైడ్ కి వెళ్ళిందనేది ఇన్సైడ్ న్యూస్.

దీంతో బన్నీకి స్క్రిప్ట్ నచ్చలేదా అనే టాక్ కూడా ఎక్కువైంది. ఒకవేళ అది నిజమే అయితే.. బన్నీ రిజెక్ట్ చేసిన మరో మూవీని రామ్ చేస్తున్నట్టే..! నిజానికి ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో రామ్ చేస్తున్న ‘ది వారియర్’ మూవీ కథ ముందుగా బన్నీ వద్దకే వెళ్ళింది. కానీ దానికి బన్నీ నొ చెప్పడంతో రామ్ వద్దకు వెళ్ళిందనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది.మరి బన్నీ వద్దనుకున్న ఈ రెండు ప్రాజెక్టులు రామ్ కెరీర్ కు ఎంత హెల్ప్ అవుతాయో.

ఇక ‘ది వారియర్’ లో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా.. బోయపాటి రామ్ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తుందో తెలియాల్సి ఉంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus