ఫిట్ నెస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గత ఏడాది నటించిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ హిట్ కావడంతో.. అందరూ ఆమెకు లక్కీ హీరోయిన్ అని పేరు పెట్టేసారు. అంతేకాదు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో చోటు ఇచ్చేసారు. స్టార్ హీరో మూవీ అంటే తన పేరు గుర్తుకొచ్చేలా రకుల్ చేసుకుంది. ఈ బ్యూటీ ఈ ఏడాది స్పైడర్ ద్వారా కోలీవుడ్ లోను అదరగొట్టాలనుకుంది. కానీ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఈ మూవీ కోలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లోను అవకాశాలను దూరం చేసిందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అసలే ఈ సంవత్సరం రకుల్ కి కలిసి రాలేదు. ఆమె నటించిన విన్నర్, జయ జానకి నాయకి రెండూ ఆశించినంత విజయం సాధించలేకపోయింది. రారండోయ్ వేడుక చూద్దాం ఒకటే మంచి పేరు తెచ్చి పెట్టింది.
ఆ పేరు ని కాస్త స్పైడర్ మూవీ తీసుకెళ్ళిపోయిందని సమాచారం. ఇప్పుడు రకుల్ తమిళంలో ఒకటి, హిందీ లో ఒక్కో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు చిత్రాలు ఒకటి కూడా లేవు. ఇది తెలుసుకున్న సినీ విమర్శకులు “ఆమె లక్ కి ఏమైంది?” అని ప్రశ్నిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పని అయిపోయినట్టే? నని చెబుతున్నారు. రకుల్ మాత్రం అపజయాలకు నిరాశ చెందడం లేదు. మంచి కథ ఒకే చెప్పి హిట్ కొట్టి పూర్వవైభవం సొంతం చేసుకోవాలని చూస్తోంది.