‘దర్బార్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డులు సృష్టిస్తుందా..?

సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్‌’. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు. ఈ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. రజినీకాంత్ సినిమాలంటే తమిళనాట మాత్రమే కాదు.. అన్ని భాషల్లో మంచి క్రేజ్ ఉంటుంది. దానికి తగ్గట్లే సినిమాని ప్రపంచవ్యాప్తంగా 7000 స్కీన్ లలో విడుదల చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కలేదు. తొలిరోజే ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.

ఈ సినిమాకి దాదాపు రూ.200 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. తమిళనాట ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ 60 కోట్లకి అమ్ముడుకాగా.. తెలుగులో పదిహేను కోట్లకు తీసుకున్నారు. ఓవర్సీస్ లో ముప్పై కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఉత్తరాదితో పాటు ఇతర రాష్ట్రాలు, ఆడియో, శాటిలైట్‌, డిజిటల్‌ లాంటి హక్కులు మొత్తం కలుపుకొని రెండు వందల కోట్ల బిజినెస్ జరిగింది. ఈ సినిమా తొలిరోజే రికార్డ్ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అన్ని భాషల్లో కలిసి భారత్ లో దాదాపు రూ.40 కోట్ల వరకు గ్రాస్ వస్తుందని.. ఓవర్సీస్ కూడా కలుపుకుంటే రూ.60 కోట్ల మార్కెట్ దాటుతుందని అంచనా వేస్తున్నారు.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus