సాధారణంగా స్టార్ హీరోలు సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో ఓ సినిమా చేస్తుంటారు. రాజమౌళి లాంటి డైరెక్టర్ల చేతిలో పడితే మూడు నుండి ఐదేళ్ల వరకు సమయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే హీరోయిన్ల విషయానికొస్తే మాత్రం ఏడాదికి తక్కువలో తక్కువ రెండు లేదా మూడు సినిమాలు చేస్తుంటారు. కానీ ఈ కథానాయికలు మాత్రం హీరోల కంటే ఎక్కువ గ్యాపే తీసుకున్నారు. అదేంటి అంటే.. ‘గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది’ అంటున్నారు.. ఇంతకీ ఎవరా హీరోయిన్స్?.. ఇప్పుడు చూద్దాం..
1) అనుష్క:
స్టార్ హీరోయిన్ అనుష్క.. 2019లో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ తర్వాత ‘నిశ్శబ్దం’ లో ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో బదిరురాలు (మూగ/చెవిటి) లాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకుంది. 2020లో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిందీ సినిమా.. దాదాపు మూడేళ్ల గ్యాప్ అనంతరం నవీన్ పోలిశెట్టి హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం చేస్తుంది. ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.
2) కృతి సనన్:
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘1 – నేనొక్కడినే’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్.. తర్వాత 2015లో నాగ చైతన్య పక్కన ‘దోచెయ్’ చేసింది. దాదాపు 8 ఏళ్ల గ్యాప్ వచ్చింది.. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీతో తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. కృతి, సీత పాత్రలో నటించింది..
3) దిశా పఠానీ:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ‘లోఫర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దిశా పఠానీ.. హీరోయిన్‌గా తనకిదే ఫస్ట్ ఫిలిం.. 2015లో ‘లోఫర్’ తర్వాత తెలుగులో కనిపించలేదు కానీ హిందీలో మూవీస్ చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ‘ప్రాజెక్ట్ – K’ తో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది.
4) కియారా అద్వానీ:
మహేష్ బాబు – కొరటాల శివల ‘భరత్ అనే నేను’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కియారా అద్వానీ.. తర్వాత రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ లో చేసింది. బాలీవుడ్‌లో బిజీ అవడంతో తెలుగు ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చింది. 2019 తర్వాత ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్‌ల సినిమాతో మళ్లీ తెలుగు తెరపై మెరవనుంది.
5) జ్యోతిక:
పైన చెప్పుకున్న కథానాయికలంతా మూడు నుండి ఎనిమిదేళ్ల గ్యాప్ తీసుకుంటే.. సీనియర్ నటి జ్యోతిక ఏకంగా 22 సంవత్సరాల తర్వాత హిందీలో నటిస్తున్నారు. ‘డోలీ సజా కే రఖ్నా’ (1998) తో కెరీర్ స్టార్ట్ చేసి, తమిళనాట ‘వాలి’ తో పరిచయమై తర్వాత దక్షిణాది భాషల్లో నటించి మెప్పించారు జ్యోతిక. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని.. 2015లో ‘36 వయదినిలే’ తో రీ ఎంట్రీ ఇచ్చి.. వరుసగా సినిమాలు చేస్తున్నారు. జ్యో చివరిగా కనిపించిన హిందీ పిక్చర్ ‘లిటిల్ జాన్’ (2001).. ఇన్నాళ్లకు తుషార్ దర్శకత్వంలో రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్న ‘శ్రీ’ అనే ఫిలిం కమిట్ అయ్యారు. ఇటీవలే ఆమె పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. త్వరలో ‘శ్రీ’ రిలీజ్ కానుంది.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?