Venkatesh: వెంకటేష్ చేతికి ఏమైంది? అంటూ ఆందోళన చెందుతున్నఅభిమానులు..!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘వి క్రియేషన్స్’ బ్యానర్లపై సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో వెర్సటైల్ యాక్టర్ ధనుష్ నటించగా బ్లాక్ బస్టర్ అయిన ‘అసురన్’ కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.. ప్రియమణి, కార్తీక్ రత్నం, అమ్ము అభిరామి, నాజర్, రావు రమేష్, వశిష్ట ఎన్.సింహా, ఆడుకలం నరేన్ తదితరులు నటించారు..

పాండమిక్ కారణంగా థియేటర్లు తెరుచుకోలేని ప్రతికూల పరిస్థితులు నెలకొన్నందున ‘నారప్ప’ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. థియేటర్లలో చూడలేకపోతున్నందుకు వెంకీ అభిమానులు చాలా నిరాశ చెందారు. కానీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఎట్టకేలకు ‘నారప్ప’ ని థియేటర్లలో చూసే అవకాశం వారికి దక్కనుంది.. డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నారు. ఆ ఒక్కరోజు మాత్రమే ఈ మూవీ థియేటర్లలో అందుబాటులో ఉంటుంది.

హాల్‌లోనే చూడాలనుకునే ప్రేక్షకాభిమానులకిది లక్కీ ఛాన్స్.. తాజాగా ‘నారప్ప’ థియేట్రికల్ రిలీజ్ గురించిన వివరాలు వెల్లడించడానికి నిర్మాత సురేష్ బాబు రామానాయుడు స్టూడియోలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు..కొంత మంది వెంకటేష్ అభిమానులు కూడా స్టూడియోకి చేరుకున్నారు.. వెంకీతో కలిసి మాట్లాడేందుకు, ఫోటోలు దింగేందుకు ప్రయత్నించారు.. ఫ్యాన్స్‌ని పలకరించిన వెంకీ.. కొంతమందికి ఫోటోలు ఇచ్చారు. అయితే ఆయన చేతికి థంబ్ స్ల్పింట్ ఉండడం చూసి.. వెంకీ చేతికి ఏమైంది? అంటూ ఆందోళన చెందుతున్నారు..

జిమ్ చేస్తుండగా బొటనవేలు బెణికిందని.. పెద్దగా ప్రమాదమేమీ లేదని తెలుస్తోంది.. దీనికి సంబంధించిన పిక్స్, వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ‘నారప్ప’ తర్వాత ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలోనే రిలీజ్ అయింది.. ఈ ఏడాది ‘ఎఫ్ 3’ తో ప్రేక్షకులను అలరించిన వెంకీ.. ఇటీవల విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. త్వరలో కొత్త సినిమా ప్రకటించనున్నారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus