Prakash Raj: చర్చకు దారి తీసిన సమీర్‌ వాట్సాప్‌ ఇన్విటేషన్‌

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ రాజకీయాలు మొదలయ్యాయి. అదేంటి చాలా రోజులైందిగా ప్రకాశ్‌ రాజ్‌ ప్రారంభించి అంటారా. అప్పుడు మొదలై చిన్న గ్యాప్‌ తీసుకున్నారు. మళ్లీ ఎన్నికల తేదీ ప్రకటించేసరికి రీస్టార్ట్‌ చేశారు. ఈసారి ‘పార్టీ’ రాజకీయాలు జరుగుతున్నాయని సమాచారం. అవును ప్యానెల్‌ సభ్యులు కొంతమంది తమ సన్నిహితుల్ని పార్టీల పేరుతో కలుస్తున్నారు. మరి అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వేరే విషయం. ప్రముఖ కథానాయకుడు నాగార్జున ఆదివారం పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌ అయింది.

ప్రకాశ్‌రాజ్‌ ఆఫీస్‌లో నాగార్జున పుట్టినరోజు వేడుకలను నిర్వహించారట. నాగ్‌ బర్త్‌డేను ప్రకాశ్‌రాజ్‌ ఆఫీసులో చేయకూడదా అని అడగొచ్చు. అయితే దీనికి సంబంధించి నటుడు సమీర్‌ తమ ‘బిగ్‌బాస్‌’ వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘బిగ్‌బాస్‌ మేట్స్‌… నాగార్జున సర్‌ పుట్టినరోజు సందర్భంగా నాలుగు సీజన్ల బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ కలుద్దాం. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నాలుగు సీజన్ల వారు ఇలా కలవడం అరుదు’ అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు సమీర్. దాంతోపాటు ‘ఈ రోజు (శనివారం) రాత్రి ఏడు గంటల నుంచి సంబరాలు షురూ.

ఫిలింనగర్‌లోని ప్రకాశ్‌రాజ్‌ గారి ఆఫీస్‌లో’ అని కూడా రాశాడు. దీంతో త్వరలో జరగనున్న ‘మా’ ఎన్నికల నేపథ్యంలో ఈ వేడుకలను ఏర్పాటు చేశారని టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. సమీర్‌… ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యుడనే విషయం తెలిసిందే. ‘బిగ్‌బాస్‌’లో పాల్గొన్నవారిలో చాలామంది ‘మా’ సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఓట్ల సమీకరణ కోసమే ఈ సెలబ్రేషన్స్‌ చేశారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా చేయకూడదా అంటే… అలాంటి రూల్‌ ఏం లేదనే సమాధానం వస్తోంది. చూస్తుంటే ఈసారి ‘మా’ ఎన్నికల మునుపెన్నడూ లేని విధంగా మారబోతున్నాయని అర్థమవుతోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus