డ్రగ్స్ మాఫియాలో సీనియర్ నటుడి కుమారుడు!

తమిళ సినీ పరిశ్రమపై మరోసారి డ్రగ్స్ వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈసారి ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ కుమారుడు అలీ ఖాన్ తుగ్లక్ ఈ వివాదంలో ప్రధానంగా నిలిచాడు. చెన్నై పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో తుగ్లక్ డ్రగ్స్ సరఫరా ముఠాకు ప్రధాన సంబంధం ఉన్నట్లు తేలింది. జె జె నగర్ పోలీసుల ఆధ్వర్యంలో ఇటీవల ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులపై నిఘా వేసినప్పుడు, డ్రగ్స్ విక్రయాల కుంభకోణం బయటపడింది.

విచారణలో విద్యార్థులు తుగ్లక్ ద్వారా గంజాయి, మెథాంఫెటమిన్ వంటి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్ యాప్‌ల ద్వారా విద్యార్థులతో డ్రగ్స్ చెలామణి చేసిన తుగ్లక్, తన స్నేహితులతో కలిసి పెద్ద స్థాయిలో ఈ వ్యాపారం నడిపినట్లు ఆధారాలు లభించాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య గంజాయి సరఫరా చేసే ముఠాతో తుగ్లక్‌కు సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కటంగొళత్తూరులోని విద్యార్థులు పెద్ద ఎత్తున డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా, పోలీసులు నిఘా పెంచారు. 12 గంటల పాటు సాగిన విచారణ అనంతరం తుగ్లక్‌తో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు తమిళ సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపుతోంది. మాదక ద్రవ్యాల కుంభకోణంలో సినీ ప్రముఖుల కుటుంబ సభ్యుల ముడిపడటం, పరిశ్రమ ప్రతిష్ఠకు దారుణమైన దెబ్బతీస్తుందని పలువురు వాపోతున్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి తుగ్లక్‌తో పాటు ముఠా సభ్యులపై హై గ్రేడ్ డ్రగ్స్ కేసులు నమోదు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తున్నారు. మరి ఈ డ్రగ్స్ కేసులో ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో చూడాలి.

ఆదిత్య 369 సీక్వెల్.. స్పెషల్ లుక్కుతో బాలయ్య క్లారిటీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags