Balakrishna,Bobby: అంతా అయిపోయిందన్నారు.. చూస్తే సందడి లేదేంది బాలయ్యా?

సంక్రాంతికి రావాలనుకుంటున్న సినిమాల ప్రచారం ఇప్పటికే మొదలైపోయింది. ఇటీవల రామ్‌ చరణ్‌ (Ram Charan)   ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ఈవెంట్‌ లఖ్‌నవూలో జరిగింది. వెంకటేశ్‌  (Venkatesh)  ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam)  ప్రచారం కూడా షురూ చేశారు. ఇక పొంగల్‌ పోరులో ఉంది అని చెబుతున్న బాలకృష్ణ (Nandamuri Balakrishna) – బాబీ  (Bobby)  సినిమా నుండి మాత్రం ఎలాంటి ఊసు లేదు. మొన్నామధ్య నిర్మాత నాగవంశీ మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆల్‌మోస్ట్‌ అయిపోయింది అనే చెప్పారు. కానీ ఇంకా సందడి లేదు.

Balakrishna, Bobby

దీంతో సంక్రాంతి సినిమాల సంగతి టాలీవుడ్‌లో తేలినట్లే ఉంది కానీ, తేలలేదు అని అంటున్నారు. కావాలంటే మీరే చూడండి అంతో కొంత క్లారిటీ ఉంది ‘గేమ్‌ ఛేంజర్‌’ విషయంలోనే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ షూటింగ్‌ ఇంకా చేయాల్సి ఉంది. అజిత్‌ (Ajith) ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ రిలీజ్‌ డేట్‌ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్‌ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు అని తెలుస్తోంది. దానికి కారణం అజిత్‌ మరోసారి ‘విదామయూర్చి’. ఈ సినిమా తేలకపోతే ఓ లెక్క.

కానీ, బాలయ్య సినిమా సంగతి అలా కాదు. ఎందుకంటే ఆ సినిమా దసరా సీజన్‌ నుండి అదిగో, ఇదిగో అంటూనే ఉన్నారు. తొలుత విజయదశమి అన్నారు, ఆ తర్వాత డిసెంబరు అన్నారు. ఆ రెండూ వదిలేసి ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు. అందులోనూ సంక్రాంతికి బాలయ్యకు సెంటిమెంట్‌ సీజన్‌. ఈ టైమ్‌లో వచ్చే సినిమాలన్నీ విజయాలే ఆయనకు. అలాంటి సీజన్‌కి వచ్చేప్పుడు ఈ పాటికి ప్రచారం మొదలుపెట్టాలి. కానీ ఇంతవరకూ ఏమీ లేదు.

సినిమా షూటింగ్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో ఇంకాస్త పని ఉందని, నిజానికి ఆ పని ఈపాటికి అయిపోవాల్సి ఉందని కానీ వివిధ కారణాల వల్ల కాలేదు అని అంటున్నారు. త్వరలో పూర్తి చేసి అప్‌డేట్‌లు మొదలుపెడతారట. ఇప్పటివరకు సినిమా నుండి ఓ టీజర్‌ వచ్చింది. టైటిల్‌ గురించి రెండు లీకులు వచ్చాయి. ‘డాకూ మహారాజ్‌’, ‘సర్కార్‌ సీతారామ్‌’ అని రెండు డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌ నేమ్స్‌ ఇవి. ఈ పాత్రల పేర్లు సినిమాలో బాలయ్య పాత్ర చిత్రణను చెప్పేలా ఉన్నాయి.

‘లక్కీ భాస్కర్’ .. అక్కడ కూడా హిట్టే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus