దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరో హీరోయిన్లుగా నటించిన ‘లక్కీ భాస్కర్'(Lucky Baskhar) చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో కూడా బాగా కలెక్ట్ చేసింది. రెండో వీకెండ్ తో ఈ సినిమా (Lucky Baskhar ) అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించింది.
ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 7.56 cr |
సీడెడ్ | 2.08 cr |
ఆంధ్ర(టోటల్) | 6.25 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 15.89 cr |
తమిళనాడు | 2.26 cr |
కేరళ | 5.25 cr |
హిందీ | 0.50 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.55 cr (తెలుగు వెర్షన్ ) |
ఓవర్సీస్ | 6.90 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని) |
వరల్డ్ వైడ్ (టోటల్ ) | 31.35 cr |
‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 11 రోజులు పూర్తయ్యేసరికి రూ.16.5 కోట్ల షేర్ ను రాబట్టి రూ.5 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం 11 రోజుల్లో రూ.31.35 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.1.35 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.