Jr NTR: మొన్న ‘దేవర’.. ఇప్పుడు ‘వార్ 2’.. దీనిని గమనించారా?

జూనియర్ ఎన్టీఆర్ కి (Jr NTR)  ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అంటే.. అతని డాన్స్, వాయిస్ అని అంతా ఎక్కువగా చెబుతూ ఉంటారు. అనర్గళంగా డైలాగ్స్ చెప్పడంలో… ఈ తరంలో ఎన్టీఆర్ ను మించిన హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా ఎన్టీఆర్ క్విక్ లెర్నర్. ఒక్కసారి డైలాగ్ పేపర్ అలా చూస్తే.. 10,15 నిమిషాల్లో ఎన్ని పేజీలు డైలాగులు అయినా ఫాస్ట్ గా చెప్పేస్తాడు అని రాజమౌళితో (S. S. Rajamouli) సహా చాలామంది డైరెక్టర్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

Jr NTR

స్టూడెంట్ నెంబర్ 1 (Student No: 1), యమదొంగ(Yamadonga) , రాఖీ (Rakhi) వంటి సినిమాల్లో ఎన్టీఆర్ నాన్- స్టాప్ గా చెప్పిన కొన్ని డైలాగులు ఫ్యాన్స్ కి మాత్రమే కాదు చాలా మంది స్టార్ హీరోలను కూడా ఇంప్రెస్ చేసేశాయి. అంతెందుకు మొన్నామధ్య ‘ఆర్.ఆర్.ఆర్'(RRR)  సినిమాకి సంబంధించి చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ‘భీమ్ ఫర్ రామరాజు’ అనే ఇంట్రో వీడియోకి ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కి అంతా ఫిదా అయిపోయారు.

అయితే ఈ మధ్య ఎన్టీఆర్ వాయిస్ లో ఆ బేస్ కనిపించడం లేదు. చాలా వరకు ‘బొంగురు వాయిస్’ అనే కామెంట్స్ చేసే విధంగా ఉంటుంది. ‘దేవర'(Devara) సినిమాలో ఎన్టీఆర్ పలికిన డైలాగ్స్ వింటే.. ఈ మార్పుని ఎవ్వరైనా గమనించవచ్చు. ఆ సినిమాలో చాలా చోట్ల ఎన్టీఆర్ వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతే కాదు నిన్న వచ్చిన ‘వార్ 2’ టీజర్లో కూడా ఎన్టీఆర్ వాయిస్ కొంత బొంగురుగా అనిపించింది.

దీంతో ఎన్టీఆర్ వాయిస్ కి ఏమైంది అని అభిమానులే షాక్ అవుతున్న పరిస్థితి.కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే ఇటీవల ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సక్సెస్ మీట్లో కానీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun S/O Vyjayanthi) ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఎన్టీఆర్ వాయిస్ బాగానే ఉంది. మరి తేడా ఎక్కడొస్తుందో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus