టిక్కెట్ టు ఫినాలే టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ రెచ్చిపోతున్నారు. బిగ్ బాస్ ఏకాభిప్రాయం అంటూ వాళ్ల మద్యలో చిచ్చుపెడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. మొదటి మూడు రౌండ్స్ గొడవలేకుండా జరిగిపోయాయి. కానీ, ఆ తర్వాత ఛాలెంజ్ లో ఏకాభిప్రాయంతో ముగ్గురు మాత్రమే పార్టిసిపేట్ చేయాలన్నప్పుడు రచ్చ మొదలైంది. హౌస్ లో ఎవ్వరూ కూడా శాక్రిఫైజ్ చేయడానికి ఇష్టపడలేదు. ఇప్పటివరకూ అందరికీ సమాన అవకాశాలే వచ్చాయి. ప్రస్తుతం ఆదిరెడ్డి 12 పాయింట్స్ లో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీహాన్ 10 పాయింట్స్ తో ఉన్నాడు.
తర్వాత రేవంత్ 9 పాయింట్స్, రోహిత్ 7, ఫైమా 6 పాయింట్స్ తో ఉంది. ఈ టైమ్ లో ఏకాభిప్రాయం హౌస్ మేట్స్ మద్యలో కుదర్లేదు. ముఖ్యంగా పోటీదారులు ఎవ్వరూ కూడా తప్పుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.
పోటీ నుంచీ తప్పుకున్న ఇనయా, కీర్తి, శ్రీసత్యలకి ఈ బాధ్యతని ఇచ్చి పోటీ పడే ముగ్గురు సభ్యులు ఎవరో చెప్పమన్నాడు. దీంతో ముగ్గురు డిస్కస్ చేస్కుని ఫైమా, రోహిత్, రేవంత్ ముగ్గురు ఆడాలని చెప్పారు. వీళ్లకే తక్కువ పాయింట్స్ ఉన్నాయని, వీళ్లకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నామ్ అంటూ ఇనయా చెప్పింది.
దీంతో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి ముగ్గురూ తమ అసహనాన్ని ప్రదర్శించారు. ఆదిరెడ్డి అయితే ఈసీజన్ లోనే వరెస్ట్ డెసీషన్ అంటూ మాట్లాడాడు. అలాగే రేవంత్ కూడా అన్ని గేమ్స్ అందరూ ఈక్వల్ గా ఆడారని, ఇప్పుడు ఈ సందర్భంలో శాక్రిఫైజ్ చేయదలుచుకోలేదని చెప్పాడు. శ్రీహాన్ అయితే ఫైమా ఆడతాను అంటే సీరియస్ అయ్యాడు. అవకాశం, అవకాశం అనడానికి ఇధి సండే ఫన్ డే కాదు అంటూ రెచ్చిపోయాడు. అందరూ ఈక్వల్ గేమ్స్ ఆడినపుడు లీస్ట్ లో ఉండేవాళ్లు తప్పుకోవడమే కరెక్ట్ అంటూ మాట్లాడాడు.
అంతేకాదు, శ్రీసత్య ఎందుకు అరుస్తున్నావ్ అంటే, నా ఇష్టం అరుస్తా, స్టార్టింగ్ నుంచీ ఆడినోళ్లు పిచ్చేళ్లా అంటూ శ్రీసత్యపై విరుచుకుపడ్డాడు. రోహిత్ తను ఆడితే జెన్యూస్ గా ఆడతాను అని, ఇలా ఎక్కువ పాయింట్స్ ఉండేవాళ్లని డ్రాప్ చేసి నేను గెలవాలని అనుకోను అంటూ గట్టిగా చెప్పాడు. అంతేకాదు, లాజిక్ పాయింట్స్ మాట్లాడుతూ నేను వాళ్ల ప్లేస్ లో ఉండి ఆలోచిస్తున్నాను అని, నేను గేమ్ ఆడను విత్ర డ్రా అవుతున్నా అంటూ రోహిత్ రెచ్చిపోయాడు.
గేమ్ ఫెయిర్ గా ఆడాలని అని, గేమ్ ఆడితే నాకే నచ్చదని పాయింట్స్ ఎక్కువగా ఉన్నవాళ్లని విత్ డ్రా చేసి ఆడటం కరెక్ట్ కాదని చెప్పాడు. అంతేకాదు, ఏకాభిప్రాయం అంటే మీ థింకింగ్ ఏంటి..? ఏకాభిప్రాయం అంటే ఛాన్స్ ఇవ్వడం కాదని తెగేసి చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ మళ్లీ ఆలోచనలో పడ్డారు. మరి ఈటాస్క్ లో ఎవరు పార్టిసిపేట్ చేశారు. టిక్కెట్ టు ఫినాలేలో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్