టాలీవుడ్‌పై ED ఇన్వెస్టిగేషన్‌.. ఇప్పటివరకు తేలింది ఏంటి?

2017 సంవత్సరంలో డ్రగ్స్ కేసులో అనేక మంది టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటపడిన విషయం తెలిసిందే. ఆ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) కూడా ఏర్పాటు చేసి అప్పట్లో నెలరోజుల పాటు దర్యాప్తు చేసింది. ప్రముఖులందరి నుండి రక్తం, జుట్టు, గోళ్ల నమూనాలను పరిశోధనల కోసం సేకరీంచారు. అనంతరం కొన్నాళ్లకు కేసులో ఎలాంటి ఆధారాలు దొరకలేదని సిట్ ప్రకటించింది. ఇక నాలుగు సంవత్సరాల అనంతరం హఠాత్తుగా రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

అదే తరహాలో 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు అందించి విచారణకు హాజరు కావాలని మళ్ళీ హై టెన్షన్ క్రియేట్ చేసింది. పూరి జగన్నాథ్, ఛార్మి, రానా, రకుల్, రవితేజ అలాగే మరికొందరు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ED అధికారులు ఈ ప్రముఖుల లావాదేవీలను ఇప్పటికే అన్ని వైపులా ట్రాక్ చేశారు. సెలబ్రెటీల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను సమర్పించమని కోరారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు కొనసాగిన విచారణలో ED అధికారులు బలమైన ఆధారాలు కనుగొనలేకపోయారని తెలుస్తోంది.

డ్రగ్ డీలర్ కాల్విన్‌తో సెలబ్రిటీల లావాదేవీలను గుర్తించలేకపోయారట. అతను ఈ టాలీవుడ్ తారల కోసం డ్రగ్స్ సరఫరా చేశాడని ఆరోపించినప్పటికీ, లావాదేవీలు ఏమి కనిపించలేదు. డ్రగ్స్ కొనుగోలు చేస్తే లావాదేవీలు ఎలా జరుగుతాయనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరి నెక్స్ట్ స్టెప్ లో అయినా ఏమైనా ఆధారాలు దొరుకుతాయో లేదో చూడాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus