వంగవీటి….ఈ పేరు వింటేనే బెజవాడలో వైబ్రేషన్స్ వస్తాయి…అయితే అలాంటి వంగవీటి చరిత్రని కధగా మలచి, దాన్ని తెరకెక్కించి సినిమా రూపంలో మనకు అందించిన ఘనత అటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మది, ఇటు నిర్మాత దాసరి కిరణ్ ది అనే చెప్పాలి…ఎందుకంటే అసలు ఈ పేరుతో సినిమా వస్తుంది అంటేనే….ఈ సినిమా పూర్తి అవుతుందో లేదో….ఒకవేళ అయిన….సెన్సార్ బోర్డ్ ఆక్సెప్ట్ చేస్తుందో లేదు…..ఒక వేల చేసి కత్తెర్లు వేసినా…సినిమా విడుదల అవుతుందో లేదో…..ఒక వేల విడుదల అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో..ఇది వంగవీటి సినిమా అనుకున్నప్పటి నుంచి నదించిన సస్పెన్స్…అయితే అవేమి లేకుండా ప్రశాంతంగా సినిమా విడుదలయ్యి, ఏ అడ్డంకులు లేకుండా ప్రదర్శింపబడుతుంది.
అయితే దానికి గల కారణం ఏంటి అంటే….నిర్మాత దాసరి కిరణ్…అదేలా సాధ్యం అయ్యింది అంటే….విజయవాడ రౌడీ రాజకీయాల నేపథ్యంలో తీసిన సినిమాను ప్రదర్శించడానికి నగరంలోని థియేటర్ల యజమానులు వెనుకంజ వేసినప్పటికీ తన రాజకీయ అనుభవంతో వారిని కన్విన్స్ చేసి సినిమాను సజావుగా రిలీజ్ చేసేలా ఒప్పించానన్నాడు దాసరి….వంగవీటి రంగా హత్య జరిగిన సమయంలో ధ్వంసమైన అలంకార్ థియేటర్లోనూ ‘వంగవీటి’ సినిమాను రిలీజయ్యేలా చేయడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని కిరణ్ తెలిపాడు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడ్డప్పటికీ పోలీసులు ఎంతగానో సహకరించారని.. థియేటర్ల దగ్గర భారీగా దళాల్ని మోహరించారని.. ఇందుకు వారికి తాను రుణపడి ఉంటానని దాసరి కిరణ్ కుమార్ చెప్పాడు. మొత్తానికి అలా తెగించి మరీ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రిలీజ్ చేయించా అని దాసరి చెబుతున్నాడు..మొత్తానికి వంగవీటి కధ అలా మొదలయ్యి ఇలా నడుస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.