Liger Movie: ‘లైగర్‌’ ఇప్పుడు రావడం వల్లే ఏం ఉపయోగమంటే..?

  • July 22, 2022 / 01:54 PM IST

ఒక్కోసారి ఆలస్యం కూడా మంచిదే అంటుంటారు. లేట్‌ అవ్వడం వల్ల లేటెస్ట్‌గా, బ్రైటెస్ట్‌గా రావొచ్చు అని చెబుతుంటారు. ‘లైగర్‌’ విషయంలోనూ అదే జరిగిందా? చూస్తుంటే అలానే అనిపిస్తోంది. నిజానికి ‘లైగర్‌’ సినిమాకు హీరో విజయ్‌ దేవరకొండ కాదు. ఇప్పటికే ఈ సినిమా కథను దర్శకుడు పూరి జగన్నాథ్‌ చాలామంది హీరోలకు వినిపించారు. అందరూ తొలుత ఓకే అనుకున్నా.. ఆ తర్వాత ఎందుకో వెనక్కి తగ్గారు. ఇప్పుడు విజయ్‌ చేస్తున్నాడు. ఇంతకముందు ఏమైందంటే…

పూరి జగన్నాథ్‌ ఇప్పుడు తీస్తున్న సినిమాల కథలు చాలా ఏళ్ల క్రితమే రాసుకున్నవి అని మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం రిలీజ్‌కి రెడీగా ఉన్న ‘లైగర్‌’, ఇటీవల మొదలైన ‘జేజీఎం’ ఎన్నో ఏళ్ల క్రితమే రెడీ చేశారు పూరి. ‘లైగర్‌’ విషయానికొస్తే ఈ కథను పూరి ఇప్పటికే అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌కు వినిపించారు. ఆ సమయంలో తొలుత ఇద్దరూ ఓకే అనుకున్నా.. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల సినిమా చేయలేదు. కానీ విజయ్‌ మాత్రం చేద్దామని ముందుకొచ్చి పూర్తి చేశాడు.

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ‘లైగర్‌’ కథను బన్నీకి పూరి చెప్పారట. ‘ఇద్దరమ్మాయిలతో’ తర్వాత కూడా చేద్దాం అన్నాడట బన్నీ. ఆ సినిమా స్టైలిష్‌ మూవీగా పేరు తెచ్చుకుంది తప్ప విజయం అందుకోలేకపోయింది. దీంతో ‘లైగర్‌’ ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత ‘టెంపర్‌’ సమయంలో తారక్‌కి ఇదే కథ చెప్పారట పూరి. అయితే ఎన్టీఆర్‌ నుండి సరైన స్పందన రాలేదట. అయితే ఈ ఇద్దరికీ చెప్పినప్పుడు కథలో హీరో, హీరోయిన్‌ ఇద్దరికీ నత్తి ఉంటుందట. అయితే కోపం వచ్చినప్పుడు హీరోకు నత్తి వస్తుంది అని అంటున్నారు.

ఇప్పుడు ట్రైలర్‌లో చూస్తే విజయ్‌ పాత్రకు నత్తి ఉంది. కాబట్టి ఇందులో పెద్ద మార్పేమీ లేదు. ఒకవేళ తారక్‌, బన్నీ అప్పుడు ఈ సినిమా ఓకే చెప్పి ఉంటే.. అది కేవలం టాలీవుడ్‌ సినిమా అయి ఉండేది. అయితే ఇప్పుడు విజయ్‌తో చేస్తుండటం, పాన్‌ ఇండియా టైమ్‌లో వస్తుండటంతో ‘లైగర్‌’ పాన్‌ ఇండియా మూవీ అయ్యింది. చూశారుగా ఆలస్యం ఎంత మంచి చేసిందో. మరి విజయం దక్కించుకుంటే ఇంకా హ్యాపీ.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus