అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుండగా, షూటింగ్ చివరి దశకు చేరింది. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ విడుదల వాయిదా పడింది. మార్చిలో మిగతా షూటింగ్ మరియు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఐతే కరోనా లాక్ డౌన్ కారణంగా అది జరగలేదు. కాగా నాగ చైతన్య నెక్స్ట్ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.
పవన్, నాని, నాగ చైతన్య కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కన్నుందట. ఐతే ఇది వీరు ముగ్గురు కలిసి చేస్తున్న మల్టీస్టారర్ కాదు. పవన్ మరియు నాని నిర్మాతలుగా నాగచైతన్య తో మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. పవన్ పి కే క్రియేటివ్ వర్క్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. అలాగే నాని వాల్ పోస్టర్ సినిమా అనే ఓ బ్యానర్ స్థాపించి అ, హిట్ అనే రెండు సినిమాలు నిర్మించారు.
వీరిద్దరితో పాటు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి నాగ చైతన్యతో మూవీ చేయనున్నారట. ఇక ఈ చిత్రానికి దర్శకునిగా సీనియర్ డైరెక్టర్ దశరధ్ వ్యవహరిస్తారట. గతంలో ఈయన నాగార్జునతో గ్రీకువీరుడు సినిమా తెరకెక్కించారు. ఇక సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ ఈయన దర్శకత్వంలో వచ్చిన హిట్ చిత్రాలు. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది.