ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘స్క్విడ్ గేమ్ 2’ ఫీవర్‌లో ఉంది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్‌సిరీస్‌ను తెగ చూస్తున్నారు. తొలి రోజుల్లో ఆశించిన టాక్ రాకపోయినా ఇప్పుడు ఒక్కొక్కరికి నచ్చుతూ సాగుతోంది. దీంతో అందరినీ ‘స్క్విడ్ గేమ్ 2’లోకి లాగేసే ప్రయత్నం జరుగుతోంది. అలా సినిమా హీరోలు, సెలబ్రిటీలు ఈ సిరీస్‌లో నటిస్తే ఎలా ఉంటుంది అనే ఊహతో ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోను సిద్ధం చేశారు ఓ ఔత్సాహిక టెక్ నిపుణుడు.
Tollywood
సినిమా పరిశ్రమలోని (Tollywood) అగ్ర హీరోలు ఇతర సెలబ్రిటీలు ‘స్క్విడ్ గేమ్ 2’ డ్రెస్‌లో కనిపిస్తే ఇలా ఉంటుంది అంటూ ఓ వీడియో సిద్ధం చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ‘స్క్విడ్‌గేమ్’లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అని క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘స్క్విడ్‌గేమ్ 2’ విషయానికొస్తే.. మొదటివారం 68 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక మూడో సీజన్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ సీజన్ 3 ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని కూడా టీమ్ ప్రకటించింది. తొలి రెండు పార్టుల మధ్య గ్యాప్ మూడేళ్లు కాగా.. ఈ సారి ఏడాది గ్యాప్‌లోనే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్యాన్స్‌ని ఎక్కువ సేపు వెయిట్ చేయించడం ఎందుకు అని టీమ్ ప్లాన్ చేసి రెడీ చేసింది అని చెబుతున్నారు.