ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘స్క్విడ్ గేమ్ 2’ ఫీవర్‌లో ఉంది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్‌సిరీస్‌ను తెగ చూస్తున్నారు. తొలి రోజుల్లో ఆశించిన టాక్ రాకపోయినా ఇప్పుడు ఒక్కొక్కరికి నచ్చుతూ సాగుతోంది. దీంతో అందరినీ ‘స్క్విడ్ గేమ్ 2’లోకి లాగేసే ప్రయత్నం జరుగుతోంది. అలా సినిమా హీరోలు, సెలబ్రిటీలు ఈ సిరీస్‌లో నటిస్తే ఎలా ఉంటుంది అనే ఊహతో ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోను సిద్ధం చేశారు ఓ ఔత్సాహిక టెక్ నిపుణుడు.
సినిమా పరిశ్రమలోని (Tollywood) అగ్ర హీరోలు ఇతర సెలబ్రిటీలు ‘స్క్విడ్ గేమ్ 2’ డ్రెస్‌లో కనిపిస్తే ఇలా ఉంటుంది అంటూ ఓ వీడియో సిద్ధం చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ‘స్క్విడ్‌గేమ్’లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అని క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో విజయ్ (Vijay Thalapathy), తారక్ (Jr NTR) , రజనీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal Haasan), చిరంజీవి (Chiranjeevi) , మోహన్ లాల్ (Mohanlal), నాగార్జున (Nagarjuna) , నాగచైతన్య (Naga Chaitanya) , సూర్య (Suriya), మహేష్‌బాబు (Mahesh Babu), ధనుష్ (Dhanush), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), ప్రభాస్(Prabhas), అల్లు అర్జున్ (Allu Arjun), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), అజిత్ (Ajith Kumar), మమ్ముట్టి (Mammootty), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), యశ్ (Yash), రామ్‌చరణ్(Ram Charan), రానా (Rana Daggubati), హృతిక్ రోషన్ (Hrithik Roshan), విక్రమ్ (Vikram), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), బ్రహ్మానందం, జానీ లీవర్ తోపాటు చెస్ ప్లేయర్లు గుకేశ్, ప్రజ్ఞానంద ఉన్నారు.
‘స్క్విడ్‌గేమ్ 2’ విషయానికొస్తే.. మొదటివారం 68 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక మూడో సీజన్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ సీజన్ 3 ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని కూడా టీమ్ ప్రకటించింది. తొలి రెండు పార్టుల మధ్య గ్యాప్ మూడేళ్లు కాగా.. ఈ సారి ఏడాది గ్యాప్‌లోనే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్యాన్స్‌ని ఎక్కువ సేపు వెయిట్ చేయించడం ఎందుకు అని టీమ్ ప్లాన్ చేసి రెడీ చేసింది అని చెబుతున్నారు.
This is so good !! AI Generated !! #SquidGameSeason2 ft #TFI pic.twitter.com/QqAyf3kTQ8
— Priyanka Reddy – Rayalaseema (@BerrySmile112) January 7, 2025