స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) . గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్ 2’ (F2 Movie) బ్లాక్ బస్టర్ కాగా, ‘ఎఫ్ 3’ (F3 Movie) కూడా డీసెంట్ సక్సెస్ అందుకుంది. వెంకటేష్, అనిల్ రావిపూడి..ల సంక్రాంతి ట్రాక్ రికార్డు కూడా బాగుంది. కాబట్టి ‘సంక్రాంతికి వస్తున్నాం’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జనవరి 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ‘గోదారి గట్టు మీద’, ‘మీను’ ‘బ్లాక్ బస్టర్ పంగల్’ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
Sankranthiki Vasthunnam Trailer Review
భీమ్స్ (Bheems Ceciroleo) ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను కూడా యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే… ఇది 2 నిమిషాల 25 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘ఎవరో పెద్ద వ్యక్తి కిడ్నాప్ అవ్వడం, నిస్సహాయస్థితిలో ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండటం.. అలాంటి టైంలో ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ మాజీ పోలీస్ అధికారి సాయం కోరడం..అయితే ఫ్యామిలీ పర్సన్ అయిన ఆ ఎక్స్ కాప్ వెళ్లి ఆ కేసును ఎలా సాల్వ్ చేశాడు?’ అనేది సినిమా కథ అని తెలుస్తుంది.
ట్రైలర్లో ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్, ముఖ్యంగా సంక్రాంతి పండుగ మూడ్ ను క్యారీ చేసే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ‘ప్రతి సినిమా రిలీజ్ కి ముందు టీజర్ ఉన్నట్టు…, పెళ్లి చేసుకునే ముందు ప్రతి మగాడి జీవితంలో ఒక ప్రేమ కథ ఉంటుంది’ ‘వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే’ వంటి డైలాగులు ఫన్నీగా అనిపిస్తాయి. ట్రైలర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :