రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమాకు దిల్‌ రాజు బడ్జెట్‌ తెలుసా?

దిల్‌ రాజు ఏ ముహూర్తాన తన ప్రతిష్ఠాత్మక 50వ సినిమా ప్రకటించాడో కానీ… అప్పటి నుండి ఆ సినిమా మీద ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. అసలు రామ్‌చరణ్‌ – శంకర్‌ కాంబినేషన్‌నే ప్రేక్షకులు ఊహించలేదు. అలాంటి సినిమా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మెమరబుల్‌ మూవీ కాబట్టి ఈ కాంబినేషన్‌ సెట్‌ చేయించుకున్నాడులే అనుకున్నారు. అయితే ఇప్పుడు బడ్జెట్‌ మాటలు బయటికొచ్చాయి. ఈ సినిమా కోసం దిల్‌ రాజు గట్టిగానే ఖర్చు పెడుతున్నాడట. శంకర్‌ సినిమా అన్నాక.. ఆ మాత్రం బడ్జెట్‌ ఉంటుందిలే అంటారా. నిజమే అనుకోండి టాలీవుడ్‌ నిర్మాతలకు ఇది పెద్ద లేక్కే కదా.

రామ్‌చరణ్‌ 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కే విషయం ఇంకా స్పష్టత రానప్పటికీ… ఈ సినిమా బడ్జెట్‌ ఇదీ అంటూ లెక్కలు బయటికొస్తున్నాయి. టాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా గరిష్ఠంగా రూ. 150 కోట్లు ఖర్చు పెట్టాలని దిల్‌ రాజు అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని శంకర్‌కు కూడా చెప్పేశారట. దిల్‌ రాజు ముందుగా బడ్జెట్‌ విషయంలో ఇంత క్లారిటీగా ఉండటానికీ కారణం ఉంది. శంకర్‌ సినిమా అంటే భారీ బడ్జెట్‌ అనేది ఎంత నిజమో… బడ్జెట్‌ లెక్కలు దాటిపోతుంది అనేది అంతే నిజం. సినిమా ముందుకెళ్తున్న కొద్దీ బడ్జెట్‌ పెరిగిపోతూ ఉంటుంది. అందుకే ఈ గరిష్ఠ బడ్జెట్‌ లెక్కలు.

ఇక సినిమా కథ విషయానికొచ్చేసరికి చాలా రకాల వార్తలొస్తున్నాయి. ‘మగధీర’ లా ఉంటుందని కొందరు. సైన్స్‌ఫిక్షన్‌ స్టోరీ అని మరికొందరు అంటున్నారు. ‘ఇండియన్‌ 2’ తర్వాత సైన్స్‌ఫిక్షన్‌ సినిమా చేస్తానని గతంలో శంకర్‌ చెప్పడమే దీనికి కారణం. మరి ‘మగధీర’ టాపిక్‌ ఎలా వచ్చిందో తెలియడం లేదు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇవయ్యాకే ఈ సినిమా మొదలవుతుందంటున్నారు. ఈలోపు చాలా పుకార్లు వస్తాయి… వాటిలో ఎన్ని నిజమవుతాయో చూద్దాం.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus