తెలుగు చలనచిత్ర సీమ మీద షార్ట్ ఫిల్మ్స్ చూపించే ప్రభావం ఎంతో చాలామందికి తెలిసిందే. సరైన షార్ట్ ఫిల్మ్ తీస్తే డైరెక్టర్ అయిపోవచ్చు అనే రేంజిలో అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే చాలామంది కుర్రాళ్లు అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఓటీటీలు వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్.. సినిమాల మధ్యలోకి వెబ్ సిరీస్‌లు, వెబ్ మూవీస్ వచ్చాయి. ఇప్పుడు ఇవే సినిమా అవకాశాలకు వేదికగా మారాయి. తాజాగా అలాంటి సినిమా తీసి అందరి దృష్టిలో పడ్డారు ఉదయ్ గుర్రాల.
‘మెయిల్’ వెబ్ ఫిల్మ్‌తో మన్ననలు పొందిన దర్శకుడే ఈ ఉదయ్ గుర్రాల. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ వెబ్ ఫిల్మ్ ఇటీవల ఓ ఓటీటీలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఉదయ్ దర్శకత్వ ప్రతిభను అందరూ మెచ్చుకున్నారు. దీంతో మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే నెక్స్ట్ అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూడా ఓ కథ సిద్ధం చేయమని చెప్పారట. దానికి ఉదయ్.. చాలా గౌరవంగా ‘దానికి ఇంకా సమయం పడుతుంది’ అని అన్నారట.
ఉదయ్ తన ప్రాజెక్టు ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్’కి చేయాల్సి ఉంది. అందుకే అశ్వనీదత్‌కు నో చెప్పాల్సి వచ్చిందట. ఉదయ్ దగ్గర ప్రస్తుతం రెండు, మూడు ఆలోచనలు ఉన్నాయట. మరి దేంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడనేది చూడాలి. అయితే ‘మెయిల్ 2’ వెంటనే స్టార్ట్ చేయాలని ఉదయ్ అనుకోవడం లేదట. దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి… తర్వాత చేద్దామని ఆలోచన చేస్తున్నాడట. ఉదయ్… పెనం వేడి మీద ఉన్న వరుస దోశెలు వేసేయాలి… ఆలస్యం చేస్తే దోశలు సరిగ్గా రావు అని పెద్దలు చెబుతుంటారు మరి.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!