‘మంత్ ఆఫ్ మధు’.. ‘మంత్ ఆఫ్ మధు’ అంటూ ఇటీవల యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర పెయిర్ అంటూ ఓ చర్చ, సాయిధరమ్‌తేజ్ ఓ ప్రెస్‌మీట్‌కి వచ్చి విష్ చేశాడు.. ఎందుకొచ్చాడు అంటూ ఓ చర్చ నడుస్తోంది. అయితే ‘మంత్ ఆఫ్ మధు’లో మంత్ అంటే ఏంటి అనేది మాత్రం టీమ్ ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. ఆ మాటకొస్తే దాని గురించి ఎక్కడా డిస్కషన్ జరగలేదు.
అయితే, ఆ మంత్ ఏంటి, దాని వెనుక ఉన్న కథ ఏంటి అనేది నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు. ఓ విధంగా సినిమాలోని కీలకమైన పాయింట్‌ని కూడా చెప్పేసినట్లు అయ్యింది. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నవీన్ చంద్ర ఈ విషయాలు చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ నాగోటి రూపొందించిన ‘మంత్ ఆఫ్ మధు’ సినిమా ఈ నెల 6న థియేటర్లలో సందడి చేయబోతోంది.
ఈ సినిమాలో నవీన్, స్వాతి భార్యాభర్తలుగా కనిపిస్తారట. ఆ పాత్రలతో పాటు అమెరికా నుండి భారత్‌కు వచ్చిన ఎన్నారై మధుమతి పాత్ర ఈ కథలో కీలకమట. ఆ అమ్మాయికి అనుకోని పరిస్థితుల్లో నవీన్ ఓ నెల రోజుల సమయం ఇస్తాడట. ఆ నెల రోజుల్లో మధుమతితో నవీన్ స్నేహం, దీని వల్ల నవీన్ – స్వాతి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది సినిమా అట. అంటే భార్యభర్తల మధ్య మరో అమ్మాయి ఓ నెల రోజులు ఉంటే ఏం జరిగింది అనేదే కథ అనుకోవచ్చు.
అంతే కాదు మధు పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని, సహజత్వానికి దగ్గరగా ఉండటం వల్ల బాగా ఇష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. చదువుకున్న రోజుల్లో హీరోలా ఉండే వ్యక్తి… ఎందుకు మారిపోయడు, ఎలా మారిపోయాడు, ఎందుకు మారాల్సి వచ్చింది అనేది సినిమా కథ అంటున్నారు. వినడానికి అయితే ఆసక్తికరంగా ఉంది. చూడాలి మరి మధు ఎంతవరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాడు, (Month of Madhu) సినిమా ఎలా ఉంటుంది అనేది.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !