మనోజ్ పెళ్లి ఇంత సింపుల్ గా.. మంచు లక్ష్మీ హయాంలో జరగడానికి కారణం అదేనట..!

మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 3న అంటే ఈరోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మనోజ్… మౌనిక ను పెళ్లాడబోతున్నాడు. మనోజ్ రెండో పెళ్లి చేస్కోబోతున్నది.. దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె. వీరిద్దరూ చాలా కాలంగా సహజీవనం చేస్తూ వస్తున్నారు. మౌనికకి కూడా ఇదివరకే పెళ్లయింది. కొన్ని కారణాల వల్ల ఆమె తన మొదటి భర్తతో విడాకులు తీసుకుని సెపరేట్ అయ్యింది.

మౌనిక మొదటి పెళ్ళికి మనోజ్ కూడా హాజరైన వీడియో మొన్నామధ్య వైరల్ అయ్యింది. మోహన్ బాబు చిన్న కొడుకు అయిన మనోజ్ పెళ్లి సింపుల్ గా తన అక్క మంచు లక్ష్మీ ఇంట్లో జరగబోతోంది. అంత పెద్ద కుటుంబానికి చెందిన వారసుడు ఇంత సింపుల్ గా ఫిలింనగర్లో ఉన్న తన అక్క ఇంట్లో జరుగుతుండటంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. మంచు ఫ్యామిలీ తలచుకుంటే పెద్ద ఫంక్షన్ హాల్లో మనోజ్ పెళ్లి జరిగించొచ్చు.

కానీ అలా జరగడం లేదు. మనోజ్ – మౌనిక లు పెళ్లి చేసుకోవడం… ఇరు కుటుంబ సభ్యులకు ఇష్టం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంచు లక్ష్మీ తమ్ముడికి అండగా నిలబడి ఈ పెళ్లి జరిపిస్తున్నట్టు తెలుస్తుంది. ‘మనోజ్ అంటే నాకు ప్రాణం, తనను తమ్ముడిలా కాకుండా కొడుకులా చూసుకుంటూ ఉంటాను. మా తల్లులు వేరైనా మా ఇద్దరిలో ఉన్న రక్తం ఒక్కటే. మనోజ్ కు ఎటువంటి కష్టం వచ్చినా నేను తనకు నేను అండగా నిలబడతాను’ అంటూ ఆమె గతంలో చెప్పుకొచ్చింది.

అలాగే మౌనికని ఇష్టపడుతున్నట్లు మనోజ్ మొదటిగా మంచు లక్ష్మీకే చెప్పాడని అతని సన్నిహితుల సమాచారం. అందుకే వీరి పెళ్లి మంచు లక్ష్మీ హయాంలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే మనోజ్ నిజంగానే మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడా? అని కొంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మంచు ఫ్యామిలీ ఈ విషయం పై అధికారికంగా స్పందించింది లేదు. కానీ మనోజ్ మాత్రం కొన్ని పోస్ట్ లు పెట్టి మౌనిక రెడ్డిని వివాహం చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

అలాగే మనోజ్ – మౌనిక రెడ్డి ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మంచు లక్ష్మీ ఇంట్లో మొదలైనట్టు కూడా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి మంచు లక్ష్మీ ఓ మెహందీ పిక్ అలాగే సంగీత్ కు సంబంధించిన పిక్ షేర్ చేసింది. ఇక మనోజ్ ‘పెళ్లి కూతురు’ అంటూ మౌనిక ఫోటోని షేర్ చేశాడు. దానికి ‘మనోజ్ వెడ్స్ మౌనిక’ ‘ఎం వెడ్స్ ఎం’ అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా జత చేశాడు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus