Bagheera: బఘీర ట్రైలర్ బానే ఉంది కానీ.. ఆ ఎలివేషనే కాస్త ఓవర్ అయ్యింది!

  • October 21, 2024 / 03:08 PM IST

ప్రశాంత్ నీల్ (Prashanth Neel) అందించిన కథతో తెరకెక్కుతున్న తాజా కన్నడ చిత్రం “బఘీర” (Bagheera) . మన “సలార్” (Salaar) ఒరిజినల్ అయిన “ఉగ్రం”తో మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న శ్రీ మురళి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ పేరు మీద కన్నడతోపాటు, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ప్రశాంత్ నీల్ ఫార్మాట్ లోనే ఎక్కడా ఎక్కువ కలరింగ్ లేకుండా, డార్క్ గా ఉంది ట్రైలర్ మొత్తం.

Bagheera

ఆఖరికి హీరోయిన్ కూడా కాస్త రంగుల కాస్ట్యూమ్స్ వేసుకోలేదు. ఒక పోలీస్, సూపర్ హీరోలా మారి అన్యాయాలను, అక్రమార్కులను ఎదిరిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ లో యాక్షన్ బ్లాక్స్ తో నింపేసింది. ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపించుకున్న ఈ ట్రైలర్ అంతా బాగానే ఉంది అనుకొనేలోపు చివర్లో వచ్చిన ఓ డైలాగ్ అప్పటివరకు ఇచ్చిన చిన్నపాటి హైప్ ను కామెడీ చేసేసింది.

హీరోను పట్టుకొని విలన్ “చావును చూసి కూడా భయపడవా” అని ప్రశ్నించగా హీరో “అద్దంలో నన్ను నేనే చూస్తూనే భయపడను, నువ్వెవడ్రా?” అని గర్వంగా చెప్పే డైలాగ్ ను ఎలా రాసారో అర్థం కాలేదు. అంటే సెన్స్ లెస్ మాస్ ఎలివేషన్ ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. చాలా సినిమాల్లో హీరోకి భయపడి విలన్ ప్రాణాలు వదిలేయమంటారా అని అడుగుతుంటారు.

కానీ.. 2024లో విడుదలవుతున్న ఓ సినిమాలో ఇలాంటి అర్థం లేని మాస్ ఎలివేషన్ డైలాగ్ ఉండడం అనేది హాస్యాస్పదం. పోనీ తెలుగు డబ్బింగ్ విషయంలో ఏమైనా తప్పు జరిగిందా అని వేరే భాషా ట్రైలర్స్ చెక్ చేయగా, అందులోనూ అలానే ఉంది. ప్రశాంత్ నీల్ లాంటి ఒక రచయిత అందించిన కథలో ఇలాంటి డైలాగ్స్ ఉండడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. మరి చాలా యావరేజ్ గా ఉన్న ట్రైలర్ కంటెంట్ తో “బఘీరా” ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పిస్తుందా లేదా అనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus