నటి నాలుక కోసేయమంటున్న పొలిటీషియన్!

బాలీవుడ్ నటి రిచా చద్దా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. సుభాష్ కపూర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ సాధారణ మహిళ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగిందనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా నటించిన రిచా చద్దా పాత్ర మాయావతిలా కనిపిస్తుండడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మరో నాలుగు రోజుల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది దళితులను అవమానించేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అంటరానివారు అనే పదాన్ని ఈ సినిమాలో వాడారని.. ప్రధాన పాత్రలో నటించిన రిచా చీపురు పట్టుకున్నట్లు చూపించడం కూడా అభ్యంతరకరంగా ఉందంటూ.. ఈ సన్నివేశాలను సినిమా నుండి తీసేయమని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే తనకు వందల సంఖ్యలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రిచా చెప్పుకొచ్చింది. ఆమె నాలుక కోసేయమంటూ ఓ రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ను షేర్ చేస్తూ..

మేం ఎవరికీ భయపడం అంటూ ట్వీట్ చేసింది రిచా. ఈమెకి మద్దతుగా నటి స్వరా భాస్కర్ అలానే మరికొందరు సెలబ్రిటీలు పోస్ట్ లు పెడుతున్నారు. సినిమా పరంగా విమర్శించే హక్కు ఉంటుంది కానీ ఇలా హింసను ప్రేరేపించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. ఇలాంటి నేరపూరిత బెదిరింపులకు వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ నిలబడాలంటూ నాట్ ఓకే అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus