శేఖర్ కమ్ములను చూడటానికి చాలా కూల్ అండ్ కామ్‌గా కనిపిస్తారు. ఆ మధ్య కాలంలో సోషల్ యాక్టివిటీస్ కూడా చేశారు. మహిళల మీద దాడుల విషయంలో ఊరూరా తిరిగి విద్యార్థుల్లో చైతన్యం నింపే పని కూడా చేశారు. ఆ సమయంలోనూ ఎంతోమంది విసిగించే ప్రశ్నలు వేసినా చాలా కూల్‌గా సమాధానలు చెప్పడం చూశాం. అలాంటాయన సెట్‌లో ఎలా ఉంటారు? ఏదైనా సీన్ నచ్చకపోతేనో, ఇంకో టేక్ అవసరం అయితేనో ఏం చేస్తారు? ఇలాంటి విషయాల్ని ఆ మధ్య ఒకసారి నాగచైతన్య, సాయిపల్లవి చెప్పారు.
శేఖర్ కమ్ముల సాధారణంగా ఎవర్నీ ఎక్కువగా పొగడరట. సీన్ బాగా వస్తే.. జస్ట్ గుడ్ అని చెప్తారట. అదే సీన్ నచ్చకపోతే మానిటర్ దగ్గర్నుంచి అలా లేచి వెళ్లిపోతారట. తొలి సినిమా నుండి శేఖర్ కమ్ముల ఇలానే చేస్తున్నారట. ఎవరైనా బాగా చేయకపోయినా, సీన్ సరిగ్గా కుదరకపోయినా అలా వెళ్లిపోతారట. ఆ తర్వాత సీన్ బాగొస్తే ‘గుడ్’ అని అంటారట. అయితే ‘లవ్‌స్టోరీ’ సినిమా టైమ్‌కి వచ్చేసరికి శేఖర్ కమ్ములలో కొంచెం మార్పు వచ్చిందట. ఇప్పుడు కొత్తగా ‘యాక్’ అనే పదం వాడుతున్నారట.
వరుసగా రెండు సినిమాలు చేసిందనేమో సాయిపల్లవికి… శేఖర్ కమ్ముల అంటే కొంచెం పొసెసివ్‌నెస్ వచ్చిందట. ‘లవ్ స్టోరీ’ సెట్లో ఆయన ఎప్పుడైనా నాగచైతన్యను పొగిడితే సాయిపల్లవికి కోపం వచ్చేదట. వెంటనే ఆయనవైపు కోపంగా చూసేదట. అంతేకాదు ఆమెకు సంబంధం లేని విషయాల్లో కూడా శేఖర్ కమ్ములకు సలహాలు ఇచ్చేదట సాయిపల్లవి. అంటే సాయిపల్లవి అవసరం లేని విషయాలు తలదూర్చేదా? ఏమో మరి డైరక్టర్‌కి ఇబ్బంది లేనంతవరకు మనకేముంది.