Dilraju: ‘ఈగల్’ టీం.. మా సినిమాని పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పలేదు…!

సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాస్తవానికి 5 వ సినిమాగా ‘ఈగల్’ కూడా రిలీజ్ కావాలి. కానీ గిల్డ్ తరఫున టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు మీటింగులు పెట్టి ‘ ‘ఈగల్’ కి సోలో రిలీజ్ డేట్ దొరికేలా చేస్తాను.. పోస్ట్ పోన్ చేసుకోండి’ అని హామీ ఇవ్వడంతో నిర్మాతలైన పీపుల్ మీడియా వారు ఓకే చెప్పి ఫిబ్రవరి 9 కి వాయిదా వేసుకున్నారు. ఆ టైంకి ‘టిల్లు స్క్వేర్’ ‘ ‘యాత్ర’ సినిమాలు రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేశారు.

ఆ సినిమాల నిర్మాతలతో మాట్లాడతానని దిల్ రాజు (Dilraju) చెప్పడం జరిగింది. అయితే ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమా కూడా ఫిబ్రవరి 9 కే రిలీజ్ కాబోతున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ దాని గురించి దిల్ రాజు చెప్పడం మర్చిపోయారు. ‘ఈగల్’ టీం కూడా ‘ఊరు పేరు భైరవకోన’ టీంని సంప్రదించడం మర్చిపోయింది. అందుకే అనుకుంట.. సైలెంట్ గా ఈరోజు ట్రైలర్ ను విడుదల చేసింది ‘ఊరు పేరు భైరవకోన’ యూనిట్.

సందీప్ కిషన్ నటిస్తున్న ఈ సినిమాకి వి ఐ ఆనంద్ దర్శకుడు. కాబట్టి ఇది చిన్న సినిమా కాదు. పైగా ట్రైలర్ కూడా బాగుంది. గతేడాది ‘సామజవరగమన’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజేష్ దండా నిర్మాత. ‘ఈగల్’ టీం కానీ దిల్ రాజు కానీ.. ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా ఫిబ్రవరి 9 కి అనౌన్స్ చేసిన విషయాన్ని ఎలా మర్చిపోయారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ ఇది చిన్న సినిమా అనుకుని వదిలేశారా? అనేది కూడా క్లారిటీ రావాలి.

‘ఈగల్’ ప్రమోషనల్ కంటెంట్ పెద్దగా ఇంప్రెస్ చేసే విధంగా లేదు.దానికి సోలో రిలీజ్ డేట్ వస్తేనే చాలా కష్టమైపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు ఎలా చక్రం తిప్పుతారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ‘ఈగల్’ టీం కనుక అడిగితే తమ సినిమా వాయిదా వేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు ‘ఊరు పేరు భైరవకోన’ యూనిట్ హింట్ ఇస్తుంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus