Jr NTR: ‘వార్‌ 2’ అయిపోవస్తోంది.. తారక్‌ కొత్త సినిమా ఏంటి? ఏది స్టార్ట్‌ చేస్తారు?

తారక్‌  (Jr NTR)  సినిమాకు ఓ గుడ్‌ న్యూస్‌.. ఓ కన్‌ఫ్యూజ్‌ న్యూస్‌ కూడా. ఆ మాటకొస్తే తారక్‌కి కూడా కన్‌ఫ్యూజ్‌ న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే కొత్త సినిమా ఏంటి? అనే ప్రశ్న ఎప్పుడూ కన్‌ఫ్యూజ్‌ పెట్టేదే కాబట్టి. అదేంటి ‘వార్‌ 2’ సినిమా చేస్తున్నాడు కదా తారక్‌ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ విషయమే ఆ సినిమా. ఎందుకంటే ‘వార్‌ 2’ చిత్రీకరణ చివరి దశకు వచ్చింది అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఆఖరి షెడ్యూల్‌ అని చెబుతున్నారు.

Jr NTR

హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) , ఎన్టీఆర్‌ కలసి నటిస్తున్న సినిమా ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. డిసెంబరు రెండో వారం నుండి ముంబయిలో క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ మొదలవుతుందని సమాచారం. హృతిక్‌ – తారక్‌పై తెరకెక్కించనున్న ఈ ఫైట్‌ కోసం చిత్ర బృందం ఓ భారీ సెట్‌ సిద్ధం చేసిందని సమాచారం. ప్రముఖ హాలీవుడ్‌ స్టంట్‌ కోఆర్డినేటర్స్‌ స్పిరో రజాటోస్, సే యోంగ్‌ ఓహ్‌ హ్యాండిల్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తారక్‌ కొత్త సినిమా ఏంటి అనే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే తారక్‌ ఓకే చేసిన సినిమాలు రెండు ఉన్నాయి. ఒకటి ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. మరోవైపు ‘దేవర 2’ కూడా చేయాలి. ఈ రెండింటిలో ఇప్పుడు రెడీగా ఉన్నది ఏదీ లేదు. ‘సలార్‌ 2’ (Salaar) సినిమా పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. అది పూర్తయ్యాక కానీ తారక్‌ సినిమా స్టార్ట్‌ అవ్వదు అని చెప్పొచ్చు.

ఇక ‘దేవర 2’ సినిమా మొదలుపెడతారేమో అనుకుంటే.. ‘దేవర 1’కి (Devara) వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని రెండో పార్టును బలంగా తెరకెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నారు దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) . దీంతో తారక్‌ ఇప్పుడు ఏ సినిమాను తొలుత స్టార్ట్‌ చేస్తారు అనే కన్‌ఫ్యూజన్‌ మొదలైంది. ఈ ఇద్దరూ కాకుండా కొత్త సినిమాను ఏమన్నా స్టార్ట్‌ చేస్తారేమో చూడాలి.

ప్లాప్ గా మిగిలిన రాజ్ తరుణ్ ‘భలే ఉన్నాడే’!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus