Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

సూర్య – వెంకీ అట్లూరి సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటికి కారణం ఆ సినిమా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలే. ఈ సినిమా కథ గురించి ఆయన చిన్న లీక్‌ ఇచ్చారు. 45 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల అమ్మాయికి మధ్య స్నేహం, ప్రేమ ఆధారంగా సూర్య కొత్త సినిమా ఉండబోతోంది అని చెప్పారు నాగవంశీ. దీంతో ఇలాంటి కథ ఒకటి ఉంది అంటూ తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో 33 ఏళ్ల క్రితం వచ్చిన ఓ సినిమా విషయం బయటకు వచ్చింది.

Venky Atluri

దీంతో అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో చాలా ప్రశ్నలు వచ్చాయి. ఎందుకంటే ఆ సినిమా అప్పట్లో ఫ్లాప్‌. కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. దీంతో ఇప్పుడు అలాంటి కథను ఎలా చూపిస్తారు అనేదే ప్రశ్న. యాజ్‌ ఇట్‌ ఈజ్‌ చూపిస్తే ఇప్పుడు కూడా ఇబ్బందులు పడొచ్చు అనే మాట వినిపిస్తోంది. ఇదంతా ఓకే కానీ.. ఆ పాత సినిమా ఏంటి అనుకుంటున్నారా? 1992లో బాలీవుడ్‌లో అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘లమ్హే’. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీని పోలి ఇప్పుడు సూర్య సినిమా ఉంటుంది అని చెబుతున్నారు.

ప్రముఖ దర్శక నిర్మాత దివంగత యష్ చోప్రా ఈ సినిమా తెరకెక్కించారు. తండ్రి వయసు ఉన్న హీరోతో.. చనిపోయిన హీరోయిన్ కూతురు ప్రేమలో పడటం ఆ సినిమాలో మెయిన్ పాయింట్. శ్రీదేవి డ్యూయల్ రోల్‌లో నటించారు. అప్పట్లో డిజాస్టర్ అయిన ఈ సినిమా ఆ తర్వాత క్లాసిక్ అనిపించుకుంది. తల్లి శ్రీదేవిని ప్రేమించి అదే పోలికలతో ఉండే ఆమె కూతురు శ్రీదేవిని కూడా అనిల్ కపూర్‌కి ముడిపెట్టడం అప్పట్లో ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు.

మరిప్పుడు దర్శకుడు వెంకీ అట్లూరి తీసుకున్నది యథాతథంగా ఇదే పాయింట్ అంటున్నారు. అదే జరిగితే ఇప్పుడు ఈ పాయింట్‌ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.

బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus