Akhanda teaser: బాలయ్య సినిమా టీజర్‌ రంగు మార్చారా?

టాలీవుడ్‌లో ఇప్పుడు డిజిటల్‌ వార్‌ నడుస్తోంది… ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే యూట్యూబ్‌ వార్‌ నడుస్తోంది. సినిమా టీజర్‌, ట్రైలర్‌, మోషన్‌ పోస్టర్‌ ఇలా పేరు ఏదైనా వీడియో వచ్చిందంటే చాలు మా వీడియోకు ఇన్ని వ్యూస్‌ వచ్చాయి, అన్ని లైక్‌లు వచ్చాయి అని ఘనంగా చెప్పుకుంటున్నారు. అందులో ఎంతవరకు నిజం వ్యూస్‌, లైక్స్‌ అనేది తర్వాత మాట్లాడితే… మా టీజర్‌/ ట్రైలర్‌ గొప్పంటే, మాది గొప్ప అని చెప్పుకుంటుంటున్నారు. అభిమానులు కూడా అదే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ తరహా వార్‌ ‘అఖండ’ టీజర్‌ విషయంలో జరుగుతోంది.

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీనివాస్‌ కాంబోలో వస్తున్న మూడో సినిమాకు ‘అఖండ’ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని చెబుతూ చిత్రబృందం టైటిల్‌ రోర్‌ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది. ఇప్పుడు ఆ వీడియో 4.5 కోట్లు వ్యూస్‌ దాటి… ఐదు కోట్ల వైపు దూసుకుపోతుంది. ఇప్పుడిదే హాట్‌ టాపిక్. ఈ టీజర్‌ వచ్చిన కొత్తలో అంత పాజిటివ్‌ టాక్‌ ఏమీ రాలేదు. అభిమానులు వావ్‌ అంటే, ప్రేక్షకులు ఓకే అన్నారు. ఏదైతేముంది ఆఖరికి హిట్‌ అయ్యి కూర్చుంది.

ఇదంతా ఓకే కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బాహుబలి’, ‘సాహో’ టీజర్లను మించి ఇప్పుడు ‘అఖండ’ దూసుకుపోవడమే ఇక్కడ ఆసక్తికరం. వాటిని మించి ఈ టీజర్‌ ఎలా వ్యూస్‌ పరంగా దూసుకెళ్తోంది అని అందరూ ఆసక్తిగా ఆలోచిస్తున్నారు. ఏముంది బాలయ్య నుంచి చాలా రోజుల తర్వాత వచ్చిన అప్‌డేట్‌ కదా అందుకే ఆ క్రేజ్ అని అభిమానులు అంటుంటే, సమ్‌థింగ్‌ ఫిషింగ్‌ అని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోకు పెయిడ్‌ ప్రమోషన్‌ జరుగుతోంది అనేది కొంతమంది వాదన. దీంట్లో ఎంతవరరకు నిజముందే ఆ యూట్యూబ్ వాడికే ఎరుక.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus