Sukumar: చరణ్‌తో అన్నారు… ఇప్పుడు చిరుతో అంటున్నారు.. ఏది నిజం!

‘పుష్ప: ది రైజ్‌’ సినిమా విడుదలైన తర్వాత ‘చిరంజీవి – సుకుమార్‌’ కాంబో అంటూ ఓ పుకారు వచ్చింది గుర్తుందా? టీమ్‌ పూర్తిగా చెప్పకుండా, చెప్పింది వినకుండా ఇదిగో సినిమా, అదిగో కథ, అదిగదిగో రిలీజ్‌ డేట్‌ అంటూ లెక్కలేసేశారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ కలుస్తోంది ఓ యాడ్‌ కోసం అని తెలిసి గమ్మునుండిపోయారు. అయితే ఇప్పుడు ఈ మేటర్‌ ఎందుకు అంటే.. మళ్లీ మెగాస్టార్‌ – మ్యాథ్స్‌ లెక్చరర్‌ కాంబో గురించి చర్చ నడుస్తోంది కాబట్టి.

నిజానికి చిరంజీవి ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగా 156, మెగా 157 అంటూ సీరియల్ నెంబర్స్‌ కూడా ఇచ్చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల మెగా 156 ఆగిపోయింది అంటున్నారు. దీంతో ఆ స్థానంలోకి కానీ, ఆ తర్వాతి స్థానంలోకి కానీ కొత్త ప్రాజెక్ట్‌ను సెట్‌ చేసే పనిలో ఉన్నారు అని ఓ టాక్‌. ఈ ప్లేస్‌లో సీనియర్‌ దర్శకుడు, స్టార్‌ దర్శకుడితో సినిమాను తీసుకొచ్చే పనిలో ఉన్నారంటున్నారు.

మొన్నీ మధ్య ఆ ప్లేస్‌లో త్రివిక్రమ్‌ పేరును తీసుకొస్తే రెండో రోజు సుకుమార్‌ పేరు వచ్చేసింది. అంటే ఈ ఇద్దరిలో ఒకరితో చిరంజీవి నెక్స్ట్‌ సినిమా ఉండొచ్చు అంటూ లెక్కలేస్తున్నారు. గతంలో వచ్చింది పుకారు కావొచ్చు కానీ ఈసారి అలా అవ్వదు అంటూ అభిమానులు సైతం బలంగా నమ్ముతున్నారు. ‘పుష్ప: ది రూల్‌’ తర్వాత ఈ సినిమా వస్తుంది అనేది వారి ఆశాభావం. మరి చిరు మనసులో ఏముందో చూడాలి.

అయితే, ఇక్కడే ఓ విషయం గుర్తు చేసుకోవాలి. నిజానికి ‘పుష్ప: ది రూల్‌’ తర్వాత (Sukumar) సుకుమార్‌ – రామ్‌ చరణ్‌ మధ్య ఓ సినిమా ఉంది. గతంలోనే దీనిని రాజమౌళి చెప్పేశారు. అంతేకాదు ఓ సీన్‌ కూడా షూట్‌ చేసేశారు అని కూడా తెలిపారు. మరి కొడుకుతో అనుకున్న ప్రాజెక్ట్‌ను తండ్రితో చేస్తారా సుకుమార్‌ మాస్టారు అనేది చూడాలి. గతంలో కొరటాల శివ కూడా ఇలా చరణ్‌ నుండి చిరువైపు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు యూవీ క్రియేషన్స్‌ కూడా అంతే.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus