‘పెద్ది’ ఉరఫ్ ‘ఆర్‌సి 16’… ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. సినిమా ఎలా ఉంటుంది, ఎలాంటి కథతో వస్తున్నారు, ఎలా తీస్తారు, ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు తెస్తారు లాంటి ఏ విషయాలూ తెలియకపోయినా ఈ సినిమా గురించే మాట్లాడుకున్నారు అంతా. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు అంతా ఈ సినిమా కథతోపాటు, ఆ కథను సిద్ధం చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu) గురించి మాట్లాడుతున్నారు.
దీంతో ఆయనలో అంత స్పెషల్ ఏముంది అనే ప్రశ్న మొదలైంది. బుచ్చిబాబు సానా తీసింది ఒక్క సినిమానే అయినా రామ్ చరణ్‌తో (Ram Charan) నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నారు. నిజానికి తారక్‌తో చేయాల్సింది. వివిధ కారణాలు, మలుపుల తర్వాత సినిమా చరణ్ దగ్గరకు వచ్చింది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో బుచ్చిబాబు గురువు ప్రముఖ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ బుచ్చి చరణ్‌ని ఒప్పిస్తాడని ఊహించలేదని, ఏఆర్ రెహమాన్‌తో (A.R.Rahman) మ్యూజిక్ అనగానే షాక్ అయ్యానని పొగిడేశారు.
ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ ‘‘బుచ్చిబాబు ఆలోచనలు గొప్పగా ఉంటాయి. నన్ను కలిసినప్పుడు ఐదు సందర్భాలు చెప్పి, ఆ బాణీల గురించి వివరిస్తూ ఓ ఫైల్ ఇచ్చారు. తన ఆసక్తి చూసి ముచ్చటేసింది’’ అని చెప్పారు. బుచ్చిబాబు కథని చెప్పిన విధానం చూసి సినిమా చేయాలనే నిర్ణయానికొచ్చానని జాన్వీ (Janhvi Kapoor) అంది. బుచ్చిబాబుకి సినిమా అంటే పిచ్చి. తన సంకల్పంవల్లే ఇదంతా సాధ్యమైంది అని చరణ్ అన్నాడు.
బుచ్చిబాబు చెప్పిన కథ విని మైండ్ బ్లాంక్ అయ్యిందని ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న కన్నడ స్టార్ నటుడు శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) చెప్పాడు. దీంతో బుచ్చిబాబులో అంత స్పెషల్ ఏముంది అనే చర్చ మొదలైంది. అయితే ‘ఉప్పెన’ (Uppena) మాత్రమే అతని టాలెంట్‌ను చెప్పేది కాదని, సుకుమార్ (Sukumar) దగ్గర అతని పనితనం తెలిసినవాళ్లు అంటున్నారు. అయితే ఈ లెక్కన బుచ్చిబాబు మీద అంచనాల బరువు మాములుగా ఉండేలా లేదు.
విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?