మహేష్ బాబు కెరీర్ లో బాగా నిరాశ పరిచిన సినిమాల లిస్టు లో ‘ఆగడు’ ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలు ముందుంటాయి అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా … ‘ఆగడు’ చిత్రం ప్లాప్ వెనుక ఓ పెద్ద స్టోరీనే ఉందనేది ఇన్సైడ్ టాక్. అసలే ‘1 నేనొక్కడినే’ సినిమా డిజాస్టర్ అయ్యిన బాధలో మహేష్ ఫ్యాన్స్ ఉంటే… ‘ఆగడు’ చిత్రం హిట్ అయ్యి ఆ బాధను తీరుస్తుంది అని ఆశ పడిన మహేష్ ఫ్యాన్స్ కు.. ఆ చిత్రం పుండు మీద కారం జల్లినట్టు చేసింది.
‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు దర్శకుడు శ్రీను వైట్ల అనే నమ్మకంతో కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే విని ఓకే చెప్పేసాడట మహేష్.అలా అని ఫుల్ స్క్రిప్ట్ కూడా లేదట. ఏమాత్రం డైరెక్టర్ ను క్వశ్చన్ చెయ్యకుండానే సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లాడు మహేష్. అయితే శ్రీను వైట్ల ముందుగా అనుకున్న కథ ప్రకారం ఈ చిత్రంలో మహేష్ అన్నయ్య గా… దివంగత నటుడు శ్రీహరిని అనుకున్నాడట. కానీ ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో ఆ పాత్రకు అజయ్ ను తీసుకున్నాడు. చాలా వరకూ ఆ పాత్రను ట్రిమ్ చేసేసారట.
ఇక ఫస్ట్ హాఫ్ కు పనిచేసిన రైటర్ అనిల్ రావిపూడి(ఇప్పుడు డైరెక్టర్) కూడా ‘పటాస్’ ఆఫర్ రావడంతో తప్పుకున్నాడని తెలుస్తుంది.ఈ విషయాన్ని ఆయన కూడా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.దాంతో సెకండ్ హాఫ్ మొత్తం కిచిడి కిచిడి అయిపోయింది. ఒకవేళ శ్రీహరి గారు ఉండి ఉంటే.. ఆయన పాత్ర బాగా డిజైన్ చేసి ఉంటే… ‘ఆగడు’ డిజాస్టర్ నుండీ తప్పించుకుని ఉండేదేమో…!