‘పుష్ప 2’ (Pushpa 2) మరో 39 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముందుగా డిసెంబర్ 6 రిలీజ్ అన్నారు తర్వాత 5 కి మార్చారు. మిడ్ నైట్ షోలు వంటివి ఉంటాయి అని ప్రకటించారు. ఒక బాగానే ఉంది. కానీ షూటింగ్ పార్ట్ సంగతేంటి. ఇప్పటివరకు ఐటెం సాంగ్ షూట్ చేయలేదు. కొంత ప్యాచ్ వర్క్ కూడా బాలన్స్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ఇదంతా దర్శకుడు సుకుమార్ (Sukumar) పై ఉన్న పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి.
సరే ఆ విషయాలు పక్కన పెట్టేద్దాం. ‘పుష్ప’ (Pushpa) రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అంటే పార్ట్ 2 అనౌన్స్ చేసి 3 ఏళ్ళు దాటినట్టే..! అయితే మూడో పార్ట్ కూడా అనౌన్స్ చేశారు. మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా నిర్మాత పార్ట్ 3 (Pushpa 3) ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి ఎన్నోళ్లు టైం తీసుకుంటాడు సుకుమార్? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే సుకుమార్ ఏ సినిమాని అయినా తెగ చెక్కుతూ ఉంటాడు.
ఆర్టిస్టులు డేట్స్ ఇచ్చినా షూటింగ్ చేయడు. ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యి.. ‘పుష్ప 2’ కి తొందరగా డేట్స్ ఇవ్వలేదు. ‘పుష్ప’ మొదటి భాగం 2021 డిసెంబర్ లో విడుదలైంది.దానికి ముందుగానే రెండో పార్ట్ ఉంటుంది అని ప్రకటించారు. వాస్తవానికి ‘పుష్ప’ ని రెండు భాగాలుగా చేయాలని మేకర్స్ అనుకోలేదు. కానీ బడ్జెట్ పెరిగిపోవడం వల్ల.. రెండో భాగం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. తెలుగులో పెద్దగా ఆడకపోయినా.. హిందీలో బాగా ఆడింది. ఇతర భాషల్లో కూడా హిట్ అనిపించుకుంది.
అందుకే సెకండ్ పార్ట్ పై బజ్ ఏర్పడింది. కానీ 3 వ పార్ట్ ఎప్పుడు మొదలుపెడతారు అంటే కచ్చితంగా చెప్పలేం. అల్లు అర్జున్.. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. అలాగే త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇవి పూర్తయ్యేసరికి 4 ఏళ్లు పట్టొచ్చు. పోనీ ఒక్క త్రివిక్రమ్ తో (Trivikram) సినిమా అనుకున్నా.. అది పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి 3 (Pushpa 3) ఏళ్ళు పట్టొచ్చు. ఆ తర్వాత వెంటనే పుష్ప 3 మొదలుపెట్టినా.. దానికి 2 ఏళ్ళు టైం పడుతుంది. సో మూడో పార్ట్ కి కచ్చితంగా 5 ఏళ్ళు పడుతుందని స్పష్టమవుతుంది.