తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి సీజన్‌కు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఈ పండుగ సమయంలో భారీ సినిమాలు బరిలో నిలవడం కొత్తేమి కాదు, పెద్ద హీరోల మధ్య పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా భారీ సినిమాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) మరియు బాలకృష్ణ (Nandamuri Balakrishna) – బాబీ (Bobby) కాంబినేషన్‌లో రూపొందుతోన్న NBK109 చిత్రాలు బరిలో ఉన్నాయి.
‘గేమ్ చేంజర్’తో పాటు NBK109 మధ్య పోటీ జరుగుతుండటంతో, సంక్రాంతి సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, బాలయ్య ఈసారి బిజినెస్‌లో చరణ్‌పై పైచేయి సాధించారని తెలుస్తోంది. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో ఈ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. సీడెడ్ ఏరియాలో బాలయ్య చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో NBK109 సినిమాకు అక్కడ రూ. 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం.
ఇది బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ గా నిలవడం గమనార్హం. రామ్ చరణ్‌కు కూడా ఈ ఏరియాలో పటిష్టమైన మార్కెట్ ఉన్నప్పటికీ, ‘గేమ్ చేంజర్’కు మాత్రం కేవలం రూ. 15 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని నందమూరి అభిమానులు హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చరణ్‌తో క్లాష్‌లో బిజినెస్ పరంగా బాలయ్య ఆధిపత్యం చూపించారని ఆనందపడుతున్నారు.
ఈ పోటీ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాల్సి ఉంది. అయితే థియేటర్ పరంగా గేమ్ ఛేంజర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50% పైగా దక్కించుకుంటన్నట్లు టాక్. నిర్మాత దిల్ రాజు (Dil Raju) ప్రత్యేకమైన ప్రణాళికలతో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి పెట్టిన పెట్టుబడిని మూవీ ఎంత స్పీడ్ గా రికవరీ చేస్తుందో చూడాలి.