నిన్న జనతా కర్ఫ్యూ కు తెలుగు రాష్ట్రాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కొంతమంది నిర్ల్యక్షంగా రోడ్లపైకి వచ్చినప్పటికీ పోలీసులు ఎంతో బాధ్యతగా వారిని మందలించిన వీడియోలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. కరోనా వైరస్ నివారణకోసం.. విరుగుడు కనిపెట్టే పనుల్లో తన కుటుంబాలను వదిలి మనమే కుటుంబంగా భావించి పనిచేస్తున్న వైద్యులకు.. అలాగే ఆర్మీ వారికి, పోలీసువారికి సంఘీభావం తెలపాలని మోడీ ఆదేశించిన సంగతి తెలిసిందే. అందుకు గాను నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రధాన మంత్రి మోడీ ఆదేశం మేరకు అందరూ కరతాల ధ్వనులతో చప్పట్లు కొట్టారు. సినిమా హీరోలందరూ కూడా ముందుకొచ్చి అలా చేసిన వీడియోలు నిన్న సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసాయి.
అయితే ఇలా చప్పట్లు కొట్టడానికి ముందుకు రాని.. అంటే వీడియోలు రిలీజ్ చెయ్యని హీరోలు ఎవరా అని రీసెర్చ్ చేసే వారు కూడా లేకపోలేదు. నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, బాలకృష్ణ, రవితేజ వంటి వారు చప్పట్లు కొట్టిన వీడియోలను రిలీజ్ చేయలేదట. దీంతో వారి పై కొందరు మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం సమాజం పట్ల బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. అయితే చప్పట్లు కొట్టినప్పటికీ .. వీడియోలు తీసి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం వారికి లేదేమో అని కూడా వారిని సమర్ధిస్తూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది కూడా నిజమే అవ్వొచ్చు కదా మరి..!
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్