Ajay Bhupathi: మంగళవారం దర్శకుడు ఏమైపోయాడు..!
- April 3, 2024 / 07:33 PM ISTByFilmy Focus
‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి (Ajay Bhupathi) .. మొదటి సినిమాతో పెద్ద బ్లాక్ బస్టరే కొట్టాడు. రూ.2.5 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్ల పైనే షేర్ ను రాబట్టింది. అందుకే అజయ్ భూపతికి ‘మహాసముద్రం’ (Maha Samudram) అనే భారీ బడ్జెట్ సినిమా చేసే ఛాన్స్ లభించింది. కానీ ఆ సినిమా అతనికి చేదు ఫలితాన్ని ఇచ్చింది. దీంతో అతనికి మూడో సినిమా ఛాన్స్ వెంటనే దక్కలేదు. కానీ అజయ్ భూపతిలోని గొప్పతనం ఏంటంటే..
టెక్నికల్ గా సినిమాని చాలా బాగా రూపొందించగలడు. ఈ కారణం వల్లనే అతనికి ‘మంగళవారం’ (Mangalavaaram) అనే పెద్ద ప్రాజెక్టు చేసే ఛాన్స్ దక్కింది. గతేడాది నవంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుని బాక్సాఫీసు వద్ద బాగానే కలెక్ట్ చేసింది. కానీ వరల్డ్ కప్ ఎఫెక్ట్ వల్ల బ్లాక్ బస్టర్ రేంజ్ లో వసూళ్లు రాబట్టలేకపోయింది.

అయినప్పటికీ కంటెంట్ పరంగా చూసుకుంటే.. అజయ్ భూపతి కంబ్యాక్ ఇచ్చినట్టే..! కానీ ‘మంగళవారం ‘ రిలీజ్ అయ్యి 6 నెలలు కావస్తున్నా ఇంకా తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేయలేదు అజయ్ భూపతి. ప్రస్తుతం టాలీవుడ్లో హీరోలు ఖాళీగా లేరు. అజయ్ భూపతి వద్ద కథలైతే ఉన్నాయి. నిర్మాతలు కూడా రెడీగానే ఉన్నారు. కాకపోతే అజయ్ భూపతి… మిడ్ రేంజ్ లేదా స్టార్ హీరోతో తన నెక్స్ట్ సినిమా చేయాలని ఆడపడుతున్నాడు. చూడాలి మరి ఏమవుతుందో ..!
















