బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టి… మధ్యలో రైటర్ అయ్యి… ఆ తర్వాత స్టార్ టీవీ కమెడియన్‌గా మారిపోయాడ ఆది. ఈటీవీ ‘జబర్దస్త్’లో ఆది లేని కామెడీ షో, డ్యాన్స్ షో, ఈవెంట్లు లేవు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆది గత కొన్ని ఎపిసోడ్‌లుగా ‘జబర్దస్త్’లో కనిపించడం లేదు. దీంతో ఏమైంది, ఆది ఎందుకు కనిపించడం లేదు అంటూ ప్రశ్నలు మొదలైపోయాయి. అయితే ‘ఢీ’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో కనిపిస్తూ వస్తున్నాయి. దీంతో ఆ ప్రశ్నలకు రకరకాల ఫ్లేవర్‌లు యాడ్ అయిపోతున్నాయి.
రీసెంట్ ‘జబర్దస్త్’ ప్రోమోల కింద కామెంట్లలో చూస్తే ‘ఆది ఎక్కడ?’ అనే ప్రశ్నే కనిపిస్తోంది. దీనికి సమాధానం ఏంటా? అని ఆరా తీస్తే కొన్ని విషయాలు తెలిశాయి. అందులో కొన్ని ఆదినే చెబితే, ఇంకొన్ని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆది ప్రస్తుతం దేశంలో లేడని టాక్. ఓ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారని చెబుతున్నారు. దాంతోపాటు వేర్వేరు ప్రాజెక్ట్‌ల వల్ల బిజీగా ఉన్నాడని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆది ‘జబర్దస్త్’లో కనిపించడం లేదని అంటున్నారు.
వేర్వేరు ప్రాజెక్ట్‌లు అంటే ‘ఢీ’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లాంటివి అన్నమాట. వీటితోపాటు ఈ మధ్య ఈటీవీ నుండి వరుసగా పండగ ఈవెంట్లు అన్నీ జరిగాయి. వాటి పనుల వల్ల ఆది ‘జబర్దస్త్’లో కనిపించడం లేదట. నిజానికి ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ రీసెంట్ ఎపిసోడ్ ఒక దాంట్లో ఆది ఉన్నా మధ్య మధ్యలోనే కనిపించాడు. పంచ్‌లు పెద్దగా వేయలేదు, అలాగే యాక్టివ్‌గా లేడు. పని ఒత్తిడి వల్లే అలా చేశాడంటున్నారు.
అయితే ఇక్కడే ఓ విషయం గుర్తు చేసుకోవాలి. రెండు వారాల క్రితం ‘ఢీ’ ఎపిసోడ్‌లో ఆది మాట్లాడుతూ ‘మే నెలలో నేను ఢీకి రాను’ అని చెప్పాడు. అలా ఎందుకు అన్నాడో అప్పుడు తెలియదు కానీ, ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే అప్పుడు అందుబాటులో ఉండను అని చెప్పాడని అర్థమవుతోంది. మేలో ఉండకపోవడానికి.. ఇప్పుడు బిజీగా లింకేంటి అంటారా. మేలో టెలీకాస్ట్ అవ్వాల్సిన ఎపిసోడ్‌లు ఇప్పటికే షూట్ చేసేశారట. అందుకే పక్కాగా లెక్కేసి మరీ చెప్పేశాడు ఆది.
ఆది బిజీగా మారి ‘జబర్దస్త్’ వదిలేయడంతోనే ఆ టీమ్‌లో ఉన్న అజార్, పరదేశీ వేరే టీమ్‌లో కనిపిస్తున్నారట. అయితే రైజింగ్ రాజు మాత్రం వేరే గ్రూపులో ఎక్కడా కనిపించలేదు. తిరిగి ఆది వస్తే రాజు వస్తారేమో. దొరబాబు పరిస్థితి కూడా ఇంతే.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!