Nivetha Thomas: నివేధా థామస్ కనబడకపోవడానికి అసలు కారణమిదేనా!

  • September 9, 2023 / 05:38 PM IST

మాలీవుడ్ బ్యూటీ నివేధా థామ‌స్ సుప‌రిచిత‌మే. `జెంటిల్మెన్`..`నిన్నుకోరి` లాంటి హిట్ సినిమాల్లో న‌టించిన బ్యూటీ కొన్నాళ్ల పాటు బాగానే సినిమాలు చేసింది. మంచి పెర్పార్మర్ గానూ పేరు తెచ్చుకుంది. కానీ అమ్మ‌డి కెరీర్ మాత్రం ఆశించిన విధంగా సాగ‌లేదు. టైర్ -2 హీరోల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. అమ్మ‌డి వేగం చూసి స్టార్ లీగ్ లో త‌క్కువ స‌మ‌యంలోనే చేరుతంద‌ని భావించినా..ఆ విధంగా జ‌ర‌గ‌లేదు. దీంతో చివ‌రికి హీరోల‌కు చెల్లెలు పాత్ర‌ల‌కు సైతం సై అనాల్సి వ‌చ్చింది.

ఈ త‌ర‌హా రోల్స్ తెలుగులో పాటు త‌మిళ్ సినిమాల్లోనూ చేసింది. చివ‌రిగా `శాకినీ డాకినీ` అనే సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది. ఆ సినిమాతో లైమ్ లైట్ లోకి రావాల‌ని చూసింది. కానీ ఫ‌లితం ఆశించిన విధంగా రాలేదు. ఆ త‌ర్వాత అమ్మ‌డు టాలీవుడ్ లో కనిపించ‌లేదు. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో రీల్స్ చేసి ట‌చ్ లో ఉండేది. కానీ కొన్ని నెల‌లుగా వాటికి దూరంగా ఉంది. యువ దర్శకుడు డైవర్స్ షాక్..! ఇక గ్లామ‌ర్ గా క‌నిపించ‌డం వంటివి ఏ నాడు చేయ‌లేదు.

నెట్టింట ఎప్పుడు డీసెంట్ ఫోటోలే పోస్ట్ చేసేది. మ‌రి ఇప్పుడు అమ్మ‌డు ఏం చేస్తుందంటే? కుటుంబంతోనే స‌మ‌యాన్ని గ‌డుపుతున్న‌ట్లు తెలుస్తోంది. సినిమాల కార‌ణంగా కొంత కాలం బిజీగా గ‌డిపిన బ్యూటీ ఇప్పుడు పూర్తి స‌మ‌యాన్ని కుటుంబానికే కేటాయిస్తుందిట‌. స్నేహితులతో చిలౌట్లు వంటి వాటికి చాలా రేర్ గా వెళ్తుందిట‌. సొంతూరు క‌న్నూరులో ఉంటే ఇల్లు త‌ప్ప మ‌రో ప్ర‌పంచం తెలియ‌కుండా ఉంటుందిట‌. అమ్మ‌..నాన్న‌…అక్క చెల్లి తంబి అంటూ ఇంటి గార్డెన్ లో స‌మ‌యాన్ని గ‌డిపేస్తుందిట‌.

అమ్మ‌డు (Nivetha Thomas) మంచి ఫుడ్డీ కూడా. ఇష్ట‌మైన వంట‌కాలు ఆర‌గిస్తుందిట‌. అన్నింటిని మించి మ‌సాలా టీ తాగ‌డం అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. డే లో ఎన్నిసార్లు మ‌సాలా టీ చేసి ఇచ్చినా తాగేస్తుందిట‌. అయితే ఇదంతా ఇంట్లో ఉంటేనే. బ‌య‌ట‌కు వ‌చ్చ స‌రికి పుడ్ విష‌యంలో క‌ఠినంగా ఉంటుందిట‌. డైట్ అంటూ కొన్ని రూల్స్ త‌ప్ప‌క ఫాలో అవుతుందిట‌. దీంతో నివేథా ఎక్కడ ఉన్నావు అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus