కరీనా కపూర్… ఇటీవల కరోనా బారినపడ్డారు. మామూలుగా అయితే ఈ విషయం ఒక రోజు వార్తే. అయితే ఆమె ఓ పార్టీకి వెళ్లడం, అక్కడి నుండి వచ్చాక కరోనా రావడం ఇక్కడ విషయంగా మారింది. కరణ్ జోహార్ నిర్వహించిన ఆ పార్టీలో బాలీవుడ్ భామలు చాలామంది పాల్గొన్నారని అందులోనే కరోనా ఒకరి నుండి మరొకరికి సోకిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బృహన్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు వెంటనే కరీనా నివాసాన్ని సీల్ చేశారు.
కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ గురించి వివరాలు సేకరిస్తున్నారు. కరీనా క్లోజ్ కాంటాక్ట్స్‌ను ట్రేస్ చేసే క్రమంలో సైఫ్ గురించి అడుగుతుంటే… కుటుంబం నుండి సరైన సమాధానం రావడం లేదట. వారం నుండి అతను ముంబయిలో లేడని చెబుతున్నారు తప్ప… ఎక్కడికెళ్లాడో చెప్పడం లేని బీఎంసీ అధికారులు అంటున్నారు. దీంతో ఈ విషయం బాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా పార్టీలో పాల్గొనడం వల్లే కరీనా, అమృతా అరోరా తదితరులకు కరోనా వచ్చింది
అనేది బీఎంసీ అధికారుల మాట. దీంతో ఈ పార్టీకి వచ్చినవారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెల 8న కరణ్ జోహార్ ఇంట్లో కొంతమంది బీటౌన్ సెలబ్స్ డిన్నర్‌కు వెళ్లారు. ఆ తర్వాతే కరీనా, అమృతకు కరోనా సోకినట్లు తేలింది. ఆ తర్వాత సీమా ఖాన్, మహీప్ కపూర్‌కు కూడా కొవిడ్ ఉన్నట్లు తేలింది. ఈ పార్టీకి హాజరైన వారిలో 12 మందికి కరోనా సోకినట్లు సమాచారం. పార్టీలో ఒకరు దగ్గుతూ కన్పించారని,
వారి నుండే ఇతరులకు కరోనా సోకి ఉంటుందని అంటున్నారు. ఆ దగ్గిన వ్యక్తి ఎవరు అనేది తెలియడం లేదు. మరోవైపు నిబంధనల ప్రకారమే కరీనా పార్టీకి వెళ్లారని ఆమె ప్రతినిథి తెలిపారు. అక్కడ ఎక్కువమంది లేరిన, సన్నిహితులంతా డిన్నర్ చేశారని ఆమె టీమ్ చెబుతోంది.