Dvv Danayya: ‘ఆర్‌ఆర్ఆర్‌’ తర్వాత దానయ్య సినిమా ఏంటి..?

‘ఆర్ఆర్‌ఆర్’తో భారీ విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య. అందులో ఆయనకు ఎంత లాభం వచ్చింది ఆ లెక్కలేంటి అనేది ఇప్పుడు ప్రస్తావనవసరం లేదు. అయితే ఆయన నెక్స్ట్‌ సినిమా ఏంటి? అనేది మాత్రం తెలియడం లేదు. అలా అని ఆయన కొత్త సినిమా లేవీ ప్రకటించలేదా అంటే ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. మరో సినిమా పనులు జరుగుతున్నాయని తెలుసు. దీంతో ఈ రెండింటిలో ఏది ముందు వస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

‘ఆర్‌ఆర్ఆర్‌’ వేడిలోనే డీవీవీ దానయ్య రెండు సినిమాలు అనౌన్స్‌ చేశారు. ఓ సినిమా పనులు బ్యాగ్రౌండ్‌లో జరుగుతున్నాయని సమాచారం. అందులో ఒకటి తనయుడు కల్యాణ్‌ దాసరిది. ‘అధీర’ పేరుతో ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌, టీజర్‌ వచ్చేశాయి కానీ ఆ తర్వాత ఎలాంటి వివరాలు లేవు. ఇది కాకుండా చిరంజీవి – వెంకీ కుడుమల సినిమా అనౌన్స్‌ చేశారు దానయ్య. ఈ సినిమా పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మొన్నీ మధ్యే కథ పకడ్బందీగా రాసుకో అని వెంకీకి చిరంజీవి చెప్పారు కూడా.

ఇక వివరాలు బయటకు రాని మరో సినిమా ప్రభాస్ — మారుతి కాంబినేషన్‌. సినిమా కథ రెడీ, కథనం రెడీ.. నటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తయింది అంటున్నారు. కానీ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఇంకా అవ్వలేదు. ప్రభాస్‌ వీలుచూసుకొని మధ్యలో డేట్స్‌ ఇస్తాడని, అప్పుడు అనౌన్స్‌మెంట్‌.. షూటింగ్‌ మొదలుపెట్టేస్తారని సమాచారం. అయితే అది ఎప్పుడు అనేది ఇంకా తెలియడం లేదు.

దీంతో దానయ్య నెక్స్ట్‌ సినిమా ఏంటి? అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. కొడుకు సినిమా స్టార్ట్‌ చేస్తారా? అంటే దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ‘హను మాన్‌’ పనుల్లో బిజీగా ఉన్నారు. అదయ్యాకే ‘అధీర’ మొదలవుతుంది. ఇక ప్రభాస్‌ సినిమా సంగతి పైన చదువుకున్నారు. వెంకీ కుడుముల సినిమా కథ ఇంకా రెడీ అవ్వలేదు. దీంతో ‘ఆర్‌ఆర్ఆర్‌’ నిర్మాత కొత్త సినిమా షురూ అవ్వడానికి ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే ఏమో.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus