Salaar: ప్రభాస్‌ డైనోసార్‌ సరే.. మరి సింహం.. పులి.. చిరుత.. ఏనుగు ఎవరు?

  • July 7, 2023 / 12:13 PM IST

ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో హీరోను పులి, సింహంతో పోల్చడం చూశాం. అయితే తొలిసారి వీటిని కాకుండా హీరోను వర్ణించడానికి ప్రశాంత్‌ నీల్‌ మరో జంతువు పేరు వాడారు. అయితే ఆ జంతువు ఇప్పుడు మనుగడలో లేదు. దీంతో అసలు ఈ జంతువుల పోలిక ఏంటి? ఆ డైలాగ్‌లో ఎందుకు వాడారు అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. గురువారం విడుదలైన ‘సలార్‌ ’టీజర్‌లో హీరో సత్తాను వివరించడానికి టినూ ఆనంద్‌ ఓ డైలాగ్‌ చెప్పాడు.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి ఆ డైలాగ్‌ కంఠతా అయిపోయి ఉంటుంది. అయినా మరోసారి ఆ డైలాగ్‌ చూద్దాం. ‘సింహం.. చిరుత.. పులి.. ఏనుగు చాలా ప్రమాదకరం.. కానీ, జురాసిక్‌ పార్క్‌లో కాదు.. ఎందుకంటే అక్కడ..’. ఇదీ ఆ డైలాగ్‌. దీని ప్రకారం చూస్తే ఈ సినిమాలో ప్రభాస్‌ డైనోసార్‌లా అన్నమాట. ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అయితే టినూ ఆనంద్‌ చెప్పిన సింహం, చిరుత, పులి, ఏనుగు ఎవరు అనేదే ప్రశ్న. అంటే ఈ సినిమాలో సలార్‌తో పోటీ పడే విలన్లు ఎవరు అని.

‘కేజీయఫ్‌’ సినిమా సాంతం గోల్డ్‌ మైన్స్‌లో సాగగా, (Salaar) ‘సలార్‌’ బొగ్గు గనుల నేపథ్యంలో ఉంటుంది. ఈ మేరకు గోదావరిఖనిలో షూటింగ్‌ కూడా చేశారు అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే… టీజర్‌లో డైలాగ్‌ ప్రకారం ఈ సినిమాలో భారీ స్థాయిలో విలన్‌ బ్యాచ్‌ ఉంటుంది అని అర్థమవుతోంది. ‘కేజీయఫ్‌’ సినిమాల్లోనూ ఇలానే ఒకరికి మించి ఒకరు అనేలా ప్రతినాయకులు ఉన్నారు. ఇప్పుడు ఇందులో వరదరాజ మన్నార్‌ పాత్రగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, రాజ మన్నార్‌గా జగపతిబాబు కనిపిస్తారని క్లారిటీ ఇచ్చేశారు.

అయితే శ్రియా రెడ్డి పాత్ర ఏంటనేది తేలాల్సి ఉంది. ఆమె కూడా విలన్‌ గ్యాంగ్‌ అనే అంటున్నారు. ఈమె కాకుండా ఇంకొందరు విలన్లు ఉన్నారట. అయితే ఇదంతా తొలి భాగం ‘సీజ్‌ ఫైర్‌’ గురించే. రెండో భాగంలో కొత్త విలన్ల ఎంట్రీ ఉందట. దీంతో ‘సలార్‌’ జురాసిక్‌ పార్క్‌లో ఇలాంటి జంతువులు చాలానే ఉంటాయి అని అర్థమవుతోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus