Niharika: సోషల్‌ మీడియాలో నిహారిక సందడి మామూలుగా ఉండదబ్బా!

సినిమాలోని ఫేమస్‌ డైలాగ్‌ని, ఫేమస్‌ సీన్‌ని షార్ట్‌ వీడియోలు చేస్తుంటూ చాలామంది ఫేమస్‌ అవుతుంటారు. మీరు కూడా ఇలాంటివారిని చాలామందిని చూసే ఉంటారు. అయితే ఆ షార్ట్‌ వీడియోను ఏకంగా ఆ హీరోతోనే చేస్తే అదిరిపోతుంది కదా. అచ్చంగా ఇదే పని చేస్తూ ‘ఎవరబ్బా ఈ అమ్మాయి… సూపర్‌ అసలు’ అనిపించుకుంటోంది నిహారిక. అసలు ఎవరీ నిహారిక, ఆమె ప్రత్యేకతలేంటో చూద్దామా? మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాకు ముందు, యశ్‌ ‘కేజీయఫ్‌ 2’ రిలీజ్‌కి దగ్గర్లో…

అజయ్‌ దేవగణ్‌ ‘రన్‌వే 34’, షాహిద్‌ కపూర్ ‘జెర్సీ’ విడుదలకు ముందు వారితో ఓ అమ్మాయి సోషల్‌ మీడియాలో షార్ట్‌ వీడియోలు చేసింది చూశారా? రీసెంట్‌ వీడియో అయితే మహేష్‌తోనే. అతని తాళాల గుత్తు దొంగిలించడానికి నిహారిక చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ఆమె ఇచ్చే క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆ ముద్దుగుమ్మ పేరు ‘నిహారిక’. నిహారిక మాటలు, చూపులు, ఎక్స్‌ప్రెషన్స్.. ఇలా అన్నీ ఫన్నీగా ఉంటాయి. అందుకే ఆమెకు సోషల్‌ మీడియాలో ఎనలేని క్రేజ్‌.

మహేష్ బాబు, యష్ వంటి స్టార్‌ హీరోలు ఆమెతో షార్ట్స్ వీడియోలు చేశారంటే ఆమె స్థాయి అర్థం చేసుకోవచ్చు. నిహారికకు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషలు తెలుసు. ఆమె ఇంగ్లిష్‌ మాట్లాడినా సౌత్‌ వాసనలు పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తాయి. అదే ఆమె వీడియోల్లో అట్రాక్షన్‌ కూడా. కాలిఫోర్నియాలోని చాప్మన్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసింది నిహారిక. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫన్నీ వీడియోలు చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. నిహారిక వీడియోలంటే రకుల్ ప్రీత్ సింగ్, రెజీనాకు చాలా ఇష్టం.

నా వీడియోలు చూసి ఫాలోవర్స్ పెట్టే కామెంట్లు చదువుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కామెంట్లు చదువుతుంటే తెలియకుండాన కన్నీళ్లు వచ్చేస్తాయి. నేను చేసే వీడియోల్లో ఎక్కువ శాతం నిజ జీవితంలో నా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఉన్నప్పుడు పుట్టే ఆలోచనలే అని చెప్పింది నిహారిక. నిహారిక చిన్నప్పటి నుండి తెలుగు, తమిళ సినిమాలు చూస్తూ పెరిగిందట. అందుకే ఆమె జోక్స్‌లో ఆ సినిమాల ప్రభావం ఎక్కువ.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus