NBK109 సినిమాకు మ్యూజిక్‌ డైరక్టర్‌ ఎవరు? క్లారిటీ వస్తుందా?

సినిమాకు సంగీతం ఎంత అవసరం? ఇదేం ప్రశ్న.. దీనికి కొలమానం ఏమైనా ఉంటుందా? అని అంటారా? అయితే ఓకే. కానీ ఓ సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు మ్యూజిక్‌ డైరక్టర్ ఎవరు అనేది చెప్పకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఏంటీ.. ఇటీవల కాలంలో ఇలా కూడా సినిమా అనౌన్స్‌ చేస్తారా? అనే మరో ప్రశ్న వేయాలనుకుంటున్నారా? అయితే వేసేయండి. ఆ సినిమా పేరు చెప్పేసి క్లారిటీ కూడా ఇచ్చేస్తాం. మీ ప్రశ్న రెడీ అయితే.. ఆన్సర్‌ #NBK109. అవును బాలయ్య సినిమా గురించే ఇదంతా.

బాబీ కొల్లి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంత పెద్ద పేరున్న బ్యానర్లు కలసి చేస్తున్న సినిమా.. పెద్ద హీరో – దర్శకుడు కలసి చేస్తున్న సినిమాకు ఇంకా మ్యూజిక్‌ డైరక్టర్‌ ఓకే అవ్వకపోవడం ఏంటి అనే డౌట్ మీకు వచ్చిందా? అయితే ఇది మీ కోసమే. అవును ఇంకా క్లారిటీ అయితే రాలేదు.. గతంలో క్లారిటీ వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోయింది అని అంటున్నారు.

ఈ సినిమాకు (NBK109) దేవిశ్రీప్రసాద్‌ సంగీత దర్శకుడు అనేది ఆ వెళ్లిపోయిన క్లారిటీ. సంగీత దర్శకుడి పేరు లేకుండా బాలయ్య – బాబి సినిమా పోస్టర్‌ రిలీజ్‌ చేయడంతో ‘ఎందుకు’ అనే ప్రశ్న వినిపించింది. దీంతో ‘ఎందుకు’ అని క్లారిటీ కోసం ట్రై చేస్తే దీని కోసం మూడు కుర్చీలాట జరుగుతోందని తెలిసింది. ప్రస్తుతం బాలయ్య సినిమా అంటే సంగీతం తమన్‌ అనే మాట ఫిక్స్‌ అయిపోయింది అభిమానుల్లో. ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలకు తమన్‌ అందించిన సంగీతం చాలా ఉపయోగపడింది.

దీంతో అతనైతే బెటర్‌ అని అంటున్నారు. కానీ నిర్మాతల ఆలోచన, దర్శకుల ఆలోచన వేరేలా ఉందట. దర్శకుడు బాబీకి దేవిశ్రీ ప్రసాద్‌ మీద గురి ఉంది. కెరీర్లో మెజారిటీ సినిమాలకు దేవీనే మ్యూజిక్ చేశారు. మరోవైపు నిర్మాత నాగవంశీకి అనిరుధ్ వైపు ఆలోచన ఉందట. అయితే బాలయ్య, అనిరుధ్‌కు సెట్ అవుతుందా అనే సందేహాలున్నాయి. దీంతో ఈ చిత్రానికి ఎవరు సంగీత దర్శకుడిగా ఖరారవుతారో చూడాలి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus