Mahesh Babu, Rajamouli: రాజమౌళి – మహేష్‌ సినిమాలో ఇంకో హీరో ఎవరు..!

విలన్‌ పాత్ర ఎంత బలంగా ఉంటే… హీరో పాత్ర అంతకుమించి పటిష్ఠంగా మారుతుంది అంటుంటారు సినిమా నిపుణులు. మాస్‌ పల్స్‌ తెలిసిన పెద్ద పెద్ద దర్శకులు తమ సినిమాల్లో విలన్లుగా పెద్ద పెద్ద నటుల్నే తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇతర భాషల్లో హీరోలను తెస్తుంటారు. అలా సినిమా తీసేవారిలో రాజమౌళి ఒకరు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తీసే సినిమా మహేష్‌దే. మరి అందులో ఆ సెకండ్‌ హీరో ఎవరు?

ఆఫ్రికన్‌ అడవులు నేపథ్యంలో సాగే కథతో రాజమౌళి – మహేష్‌బాబు సినిమా ఉంటుందని రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇటీవల ప్రకటించారు. దాని కోసం ఓ నవల హక్కులను కూడా తీసుకున్నారని సమాచారం. అందులో ఎలాగూ విలన్‌ ఉంటారు. మరి ఆ విలన్‌ ఎవరు? రాజమౌళి స్టైల్‌లో చూస్తే ఇతర భాషల్లో ఓ దుమ్ము దులిపిన వారిని ఇక్కడికి తీసుకొస్తుంటారు. ఇటీవల కాలంలో అదే జరిగింది. ‘బాహుబలి’లో రానా పాత్ర అలానే ఉంటుంది.

‘ఆర్‌ఆర్ఆర్‌’లో అయితే ఏకంగా ముగ్గురు స్టార్‌ హీరోలను తీసుకున్నారు. మరి మహేష్‌ పక్కన కళ్లను భారీగా ఆనే ఆ హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే రాజమౌళి ‘ఆర్ఆర్‌ఆర్‌’ తర్వాత, మహేష్‌ బాబు #SSMB28 తర్వాత మొదలవ్వొచ్చు. జక్కన్న త్వరలో ఫ్రీ అయిపోతారు… ఇక సినిమా ప్రీప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేస్తారు. అప్పుడు ఏమన్నా… క్లారిటీ వస్తుందేమో.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus