Naveen Polishetty: నవీన్‌ సినిమా రెండో నిర్మాత ఎవరో తెలుసా?

‘జాతిరత్నాలు’ సినిమాతో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిలో పడిన హీరో నవీన్‌ పొలిశెట్టి. అప్పటికే ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస్‌ ఆత్రేయ’లో నటించినా… ‘జాతిరత్నాలు’తోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయంలో చాలా రోజుల నుండి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి రెండు బ్యానర్లు పేర్లు వినిపించినా… ఆఖరికి సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సినిమా ఓకే అయ్యింది. తాజాగా సినిమా ప్రమోషనల్‌ వీడియో కూడా రిలీజ్‌ చేశారు.

ఈ సినిమాకు సంబంధించి కీలక సమాచారం చెబుతూ… వీడియో రూపొందించారు. కళ్యాణ్‌ శంకర్‌ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్‌ పట్టుకోబోతున్నాడు. అంతేకాదు ఇదే సినిమాతో కొత్త నిర్మాత కూడా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పేరుతో సాయి సౌజన్య నిర్మాత అవతారమెత్తుతున్నారు. నిజానికి ఈమె ఇండస్ట్రీకి కొత్తేం కాదు. చాలా ఏళ్లు నుండి వీరి కుటుంబం పరిశ్రమలోనే ఉంది. మీరు స్ట్రెయిట్‌గా చెప్పాలంటే… ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ భార్యనే ఈ సాయి సౌజన్య.

చాలా రోజుల నుండి త్రివిక్రమ్‌ నిర్మాణ రంగంలోకి రావాలని అనుకుంటున్నారు. ఆ మధ్య ఓ సారి వచ్చినా… బ్యానర్‌ పేరు లేదు. అయితే ఇప్పుడు నవీన్‌ పొలిశెట్టి సినిమాతో నిర్మాతగా మారారు సాయి సౌజన్య. మరి నిర్మాణ రంగంలో త్రివిక్రమ్‌ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, హారిక హాసిని టీమ్‌ అండదండలు పుష్కలంగా ఉంటాయనుకోండి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!


టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus