సంక్రాంతికి చిరంజీవి సినిమా.. ఇంకా బరిలో ఉన్నది ఎవరు? ఎవరుంటారు?

సంక్రాంతి (Pongal) బరిలో నిలిచేది వీరే అంటూ ఆరేడు నెలల ముందు నుండే టాలీవుడ్‌లో లెక్కలేసుకుంటూ ఉంటారు. అలా ఈసారి లెక్కలేసుకునే టైమ్‌ వచ్చేసింది. ఎందుకంటే ఆరేడు నెలల్లోనే సంక్రాంతి రాబోతోంది. కాబట్టి 2026 సంక్రాంతి లెక్కలు ఓసారి మాట్లాడుకోవాలి. అలాగే సంక్రాంతి బరిలో ఇన్నాళ్లూ ఉన్న ఓ పెద్ద సినిమా ఇప్పుడు మిడ్‌ 2026కి వెళ్లిపోయింది కాబట్టి ఇంకా ఏమొస్తాయి లైన్‌లోకి అనే విషయాలు కూడా మాట్లాడుకోవాలి. ఇక ప్రస్తుతం పక్కాగా పొంగల్‌ ఫైట్‌కి రెడీ అంటున్న సినిమా గురించి కూడా చెప్పుకోవాలి. అదే చిరంజీవి (Chiranjeevi) – అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) సినిమా.

Pongal

‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam)  అంటూ ఈ సంక్రాంతికి వచ్చి భారీ విజయం అందుకున్నారు అనిల్‌ రావిపూడి. ఆ తర్వాతి సినిమాగా చిరంజీవితో ఓ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశారు. ఇటీవల సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టారు. త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తారు అని సమాచారం. అనిల్‌ రావిపూడి తన నార్మల్‌ స్పీడ్‌లో షూటింగ్‌ చేసినా సంక్రాంతికి సినిమా వచ్చేయడం పక్కా. ఆ లెక్కన ముందుగా చెప్పినట్లు పొంగల్‌ ఫైట్‌కి శంకర్‌ వరప్రసాద్‌ అలియాస్‌ చిరంజీవి కచ్చితంగా వస్తాడు. దీంతో ఆయనతోపాటు వచ్చేవారు ఎవరు అనేదే ఇక్కడ ప్రశ్న.

ప్రస్తుత టాలీవుడ్‌ పరిస్థితి చూస్తే.. వచ్చే సంక్రాంతికి (Pongal) వచ్చేది ఎవరు అనే విషయంలో కాస్త క్లారిటీ వస్తోంది. నిన్న మొన్నటి వరకు పొంగల్‌ ఫైట్‌కి బరిలో నిలిచిన తారక్‌ (Jr NTR)  – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాను వచ్చే ఏడాది జూన్‌ 25కి వాయిదా వేశారు. ఇక ప్రభాస్ (Prabhas)సినిమాలు మాత్రమే సంక్రాంతికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ‘ఫౌజీ’ (వర్కింగ్‌ టైటిల్‌), ‘ది రాజాసాబ్‌’  (The Rajasaab) రెడీ అవుతున్నాయి. రిలీజ్‌ డేట్‌లు ఎప్పుడు ఫైనల్‌ చేస్తారో తెలియదు. పవన్‌ కల్యాణ్‌కి (Pawan Kalyan) కూడా ఛాన్స్‌ ఉంది కానీ అన్న సినిమా ఉన్నప్పుడు వస్తారా అంటే కష్టమే అని చెప్పాలి.

వెంకటేశ్‌ (Venkatesh) , రవితేజ (Ravi Teja)  సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అయితే అంత క్లారిటీగా చెప్పలేం. అల్లు అర్జున్‌ (Allu Arjun)  – అట్లీ (Atlee Kumar)   సినిమా ఉన్నా సంక్రాంతికి రెడీ అయ్యే అవకాశం కనిపించడం లేదు. నితిన్  (Nithiin) – వేణు యెల్దండి (Venu Yeldandi) ‘యల్లమ్మ’, నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) ‘అనగనగా ఒక రాజు’  (Anaganaga Oka Raju)  ఉన్నాయి. అయితే చిన్న సినిమాల అనధికార కోటాలో ఈ రెండింటిలో ఒకటి రావొచ్చు అంటున్నారు. చూద్దాం మరో మూడు నెలల్లో పూర్తి క్లారిటీ వస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus