బాలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు సరైన విజయాలు దక్కడంలో ఇబ్బందిగా ఉన్న ఈ సమయంలో కొత్త నటులతో వచ్చిన ఓ సినిమా మంచి విజయం అందుకుంది. దీంతో ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ హీరోల్లో ఒకరు ఆ సినిమా చేస్తారని చెబుతున్నారు. అయితే అలాంటి సినిమా మన దగ్గర ఆడుతుందా అనే డౌట్ కూడా రెయిజ్ చేస్తున్నారు సినిమా జనాలు.
బాలీవుడ్ రెగ్యులర్ స్టైల్‌కి భిన్నంగా ప్రమోషన్లు ఎక్కువ చేయకపోయినా ఆడియన్స్‌కి బాగా రీచ్ అయ్యి మంచి టాక్, కలెక్షన్లు సంపాదించింది ‘కిల్’. దీంతో ఈ సినిమాను తెలుగులో యువ హీరోతో తీద్దామనే ఆలోచనలో ఉన్నారట. దీని కోసం సుధీర్ బాబు (Sudheer Babu) , కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) , సందీప్ కిషన్ (Sundeep Kishan) లాంటి కుర్ర హీరోల్లో ఒకరు అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారట. ఒక రాత్రి ట్రైన్‌లో జరిగే సంఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఈ ‘కిల్’.
ఇలాంటి కథలు గతంలో వచ్చినా, సరైన ఫలితం అందుకోకపోయినా కరణ్ జోహార్ (Karan Johar) ఎంతో నమ్మకంగా ఈ సినిమాను నిర్మించారు. అనుకున్నట్లుగానే ఈ సినిమాకు మంచి రిజల్టే వచ్చింది. అయితే హిందీలో కొత్త హీరో చేశాడు కాబట్టి అక్కడ పెద్ద ఇబ్బంది రాలేదు. మన దగ్గర అలా కొత్తవాళ్లు చేస్తే కాస్త ఓకే అనొచ్చు. దానికితోడు సర్వైవల్ థ్రిల్లర్స్ మన దగ్గర పెద్దగా ఆడిన దాఖలాలు లేవు.
నాగార్జున (Nagarjuna) ‘గగనం’ (Gaganam) , మలయాళం డబ్బింగ్ సినిమా ‘హెలెన్’ లాంటి సినిమాలు రీసెంట్‌గా వచ్చి సరైన ఫలితం అందుకోలేకపోయాయి. దీంతో తెలుగులో ఈ సినిమా చేస్తారా? చేస్తే ఓకేనా? అనేది డౌట్. మరి ఎవరైనా ముందుకు వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అన్నట్లు ఈ సినిమా ఈ నెల 23 నుండి ఓటీటీలోకి వచ్చేస్తుంది అంటున్నారు. అందులో తెలుగు ఉంటుందా? అనేది చూడాలి. ఒకవేళ ఉంటే రీమేక్ లేనట్లే అని చెప్పొచ్చు.