Tollywood: ఏపీ ఆన్‌లైన్‌ విధానంపై టాలీవుడ్‌ ఏం చేస్తుందో?

‘సినిమా లాంటి ప్రైవేటు వ్యవస్థ, వ్యాపారాల మీద ప్రభుత్వ పెత్తనం ఏంటి?’ ఈ మాట మేమొక్కరే అనడం లేదు. టాలీవుడ్‌లో చాలామంది మనసులో ఇదే ఉన్న వివిధ కారణాల వల్ల బలంగా తమ వాదన వినిపించలేకపోతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన అనుకున్నట్లుగా ఆన్లైన్‌ టికెటింగ్‌ విధానం తెస్తూ ‘ఏపీ సినిమాటోగ్రఫీ చట్టం’లో సవరణల బిల్లు ఆమోదింపజేసుకుంది. అయితే ఈ క్రమంలో టాలీవుడ్‌ పెద్దలు కోరిన ఓ మార్పు మాత్రం జరగలేదు అంటున్నారు. దీంతో టాలీవుడ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

పదేళ్ల క్రితం థియేటర్లలో ఉన్న టికెట్‌ ధరలు ఇప్పుడు ఏపీలో ఉన్నాయి అంటున్నారు పరిశీలకులు. ఎందుకు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు లాంటి అంశాలు పక్కన పెడితే… ఆ ధరలతో థియేటర్లు నిర్వహించడం చాలా కష్టం. దాదాపు అసాధ్యం అంటారు. దీంతో టికెట్‌ ధరగా కనీసం ₹100 ఉండాలని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. అలా చేస్తే ఆన్‌లైన్‌ విధానంలోకి వెళ్లినా కాస్త ఉపయోగం ఉంటుందని వారి ఆలోచన. ఈ విషయాన్ని గత కొన్ని నెలలుగా ఏపీ ప్రభుత్వ పెద్దల వద్ద చెబుతున్నారు కూడా.

అయితే ఏపీ ప్రభుత్వ తాజా ఆలోచన చూస్తుంటే… టికెట్‌ ధరలు పెంచే విషయంలో ఎలాంటి మార్పు లేదు అనిపిస్తోంది. అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని చెప్పిన దాని ప్రకారం… బెనిఫిట్‌ షోలు లేవు, భారీ టికెట్‌ ధరలు లేవు అని అన్నారు. అయితే కనీస ధర ఎంత, టాలీవుడ్‌ పెద్దల విన్నపం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. బయట కూడా దాని గురించి చెప్పలేదు. ఈ క్రమంలో ప్రస్తుత ధరలతో సినిమాలు విడుదల చేస్తే… లాభాల మాట పక్కనపెడితే.. థియేటర్లు మూసుకోవడం ఖాయం అంటున్నారు. నిర్మాతల పరిస్థితి కొత్తగా చెప్పక్కర్లేదు.

దీంతో ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై టాలీవుడ్‌ పెద్దలు కోర్టుకి వెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి. వెళ్తే గిళ్తే త్వరలో రిలీజ్‌లు ఉన్న నిర్మాతలు వెళ్లాలి. లేదంటే అందరూ కలసి వెళ్లాలి. అయితే ‘కోర్టు మెట్లు ఎక్కేది లేదు. సీఎంతో మాట్లాడుకుంటాం’ అని మొన్నీ మధ్య డీవీవీ దానయ్య చెప్పారు. దీంతో మిగిలింది మైత్రీ మూవీ మేకర్స్‌, యూవీ క్రియేషన్స్‌,, హారిక హాసిని, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌, గీతా ఆర్ట్స్‌, దిల్‌ రాజు వెళ్లాలి. కానీ వీళ్లంతా ప్రభుత్వంతో చర్చలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ విషయం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus