చరిత్రను సినిమాగా తీయడం మనం చాలా సార్లు చూశాం. అలాగే ప్రస్తుతాన్ని కూడా సినిమా తీస్తుంటారు. అంటే ఎప్పుడో జరిగిన విషయాలనే కాకుండా, లేటెస్ట్‌గా జరిగిన విషయాలను కూడా సినిమాగా తెరకెక్కిస్తుంటారు. అయితే రెండూ చరిత్రలే. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చరిత్ర అంటే ‘చంద్రయాన్ 3’. ప్రపంచ వేదిక మీద మన దేశం ప్రతిష్ఠను మన ఇస్ట్రో ‘చంద్రయాన్ 3’ రూపంలో ఎగరేసింది. చంద్రుడి మీద దక్షిణ దృవం మీద తొలుత రోవర్‌ను దింపిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
ఇంతటి గొప్ప ఘట్టాన్ని సినిమాగా తీస్తే… అదిరిపోతుంది కదూ! ఇప్పుడు ఇదే చర్చ. ఎందుకంటే ‘చంద్రయాన్ 2’ చివరి నిమిషంలో విఫలమయ్యాక, ‘చంద్రయాన్ 3’ భయాలతోనే అడుగేసింది. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ.. పడిన చోట నిలబడి మన దేశ ఘనతను ఇస్రో మరోసారి ప్రపంచానికి చాటింది. ఈ మొత్తం ప్రక్రియను ఓ సినిమా రూపంలో చూపిస్తే బాగుంటుంది అనేది కొందరి ఆలోచన. దీంతో ఎవరు ఈ సినిమా తీస్తారు అనే చర్చ మొదలైంది.
మామూలుగా బాలీవుడ్ ఇలాంటి సినిమాలకు ముందుకొస్తుంది. అందులోనూ అక్షయ్ కుమార్ అయితే రెడీగా ఉంటాడు. ‘మిషన్ మంగళ్’, ‘ఎయిర్ లిఫ్ట్’ లాంటి సినిమాలు ఆయన నుండి వచ్చివనే. ఇప్పుడు ఆయనే ‘చంద్రయాన్ 3’ కోసం ముందుకొస్తే బాగుంటుంది అంటున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్‌తోపాటు, ఇతర పరిశ్రమల్లోనూ ఇలాంటి సినిమాలకు చాలామంది ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ నుండి కూడా సినిమా రావొచ్చు.
‘చంద్రయాన్ 3’ (Chandrayaan-3) 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం, ఈ ప్రాజెక్ట్‌లో ఎవరెవరు భాగమయ్యారు, ఏయే పనులు చేశారు, లాండింగ్ సమయంలో భావోద్వేగాలు.. ఇలా చాలా విషయాలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేయొచ్చు. తెలుగులో వరుణ్ తేజ్‌తో ‘అంతరిక్షం’ అనే సినిమాను సంకల్ప్ రెడ్డి తెరకెక్కించారు. ఆయనేమైనా ఇప్పుడు ‘చంద్రయాన్ 3’ ఆలోచన చేస్తారేమో చూడాలి. లేదంటే ‘మిషన్ మంగళ్’ తెరకెక్కించిన జగన్ శక్తి అయినా తీసేయొచ్చు.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్